ప్రొ.నాగేశ్వర్ : బీజేపీయేతర కూటమి ఎందుకో చంద్రబాబు చెప్పాలి..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు… బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం ఆయా పార్టీల అధినేతలతో చర్చలు జరుపుతున్నారు. గతంలో ఎన్టీయార్ హయాం నుంచి టీడీపీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి.. దానికి చైర్మన్‌గా వ్యవహరించారు. ఇప్పుడు చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.

గత కూటముల అనుభవాలు ఏం చెబుతున్నాయి..?

టీడీపీ అధినేత చంద్రబాబు.. అమరావతిలో బీజేపీయేతర పార్టీల కూటమి ర్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని దాదాపుగా నిర్ణయించారు. ఒకప్పుడు ఎన్టీఆర్ కాంగ్రెసేతర పార్టీలతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఇప్పుడు… చంద్రబాబు.. విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. రాహుల్ గాంధీ సహా.. పది పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని చెబుతున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో… బెంగాల్‌కు వెళ్లి చంద్రబాబు మమతా బెనర్జీని కలవబోతున్నారు. ఇప్పుడు .. తన ప్రయత్నాలకు సహకరిస్తే.. బీజేపీకి వ్యతిరేకం.. సహకరించకపోతే.. బీజేపీకి అనుకూలం అన్న సిద్ధాంతాన్ని చంద్రబాబు ఇప్పుడు ప్రచారంలోకి తెస్తున్నారు. అంటే.. బీజేపీ అనూకల ఫ్రంట్, బీజేపీయేతర ఫ్రంట్ మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు. ఇంకో మార్గంలేదని… చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి ఫ్రంట్లు కొత్త కాదు. కానీ గత అనుభవాలు చూస్తే.. ఫ్రంట్లు విపలమయ్యాయి. కొన్ని సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చాయి. వెంటనే.. అధికారాన్ని కోల్పోయాయి. ఈ అనుభవాల నుంచి.. చంద్రబాబు కానీ… విపక్షాలు ఏమి నేర్చుకున్నాయి..? ఇంత వరకూ ఏర్పడిన కూటముల్లోని పార్టీలు రాజకీయ అవసరాల వల్ల ఎందుకు వెళ్లిపోయాయి..? .

కూటముల వైఫల్యం వల్లే బీజేపీ బలపడిందా..?

ఈ కూటముల ప్రయోగాల వల్ల బలపడింది.. భారతీయ జనతా పార్టీనే. భారతీయ జనసంఘ్ అనే ఓ చిన్న పార్టీ… ఇప్పుడు.. బీజేపీగా మారి… చాలా బలీయమైన శక్తిగా మారింది. వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతిచ్చింది బలపడింది. వాజ్ పేయి ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలబెట్టారు. తర్వాత బీజేపీ మరింత బలపడింది. అంటే అర్థం ఏమిటి… బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయాలని… ప్రయత్నాలే ఎంత వేగంగా జరిగాయో.. బీజేపీ అంతే వేగంగా బలపడుతూ వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది..? ఆనాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కానీ.. ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా కానీ కలవడానికి… ప్రాతిపదిక ఏమిటి..?. రాజకీయ అవసరాల కోసమే… మోడీని ఓడించడానికే… అందరం కలుస్తున్నామనే వాదన వల్ల.. ప్రయోజనం ఉండదు. పార్టీల రాజకీయ అవసరాల కోసం కాకుండా.. ప్రజల ఆర్థిక, మౌలిక, రాజకీయ అవసరాల కోసం.. కలుస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. ఇప్పటి వరకూ పార్టీలన్నీ.. రాజకీయ అవసరాల కోసమే కలుస్తున్నారు. చంద్రబాబుకు… ఇప్పుడు కేవలం రాజకీయ అవసరాల కోసమే.. బీజేపీని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం.. చంద్రబాబు ఏర్పాటు చేసే.. బీజేపీ అనుకూల.. వ్యతిరేక ఫ్రంట్లలో ఎందుకు చేరాలి..?

బీజేపీ విధానాలను ఎందుకు ఇప్పటి వరకూ ప్రశ్నించలేదు..?

ఈ ఫ్రంట్ విజయవంతం కావాలంటే.. నరేంద్రమోడీపై కోపం ఉంది… ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ అవసరం ఉంది.. అఖిలేష్‌కు యూపీలో అవసరం.. ఉంది.. మహారాష్ట్రలో శివసేనకు అవసరం ఉంది.. బీహార్‌లో లాలూ కు అవసరం ఉంది.. అని.. చెప్పుకుంటే.. ప్రజలు ఎందుకు ఆదరిస్తారు..?. వారి వారి రాజకీయ అవసరాల కోసం పొత్తులు, కూటములు పెట్టుకుంటే ప్రజలు ఎందుకు ఆమోదించాలి. చంద్రబాబును నాయుడు..మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. ఇప్పటికీ… ఆయన దీనిపై విమర్శలు చేయడం లేదు. జీఎస్టీని.. సమర్థించారు. జీఎస్టీ అనేది.. రాష్ట్రాల హక్కులపై దాడి.. అని చంద్రబాబు ఇప్పటికీ చెప్పడం లేదు. అందుకే.. కూటమి సిద్ధాంతాలపై ముందుగా ఓ అభిప్రాయానికి రావాలి. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలేమిటి..?. హోంమంత్రి రాజ్ నాథ్ పార్లమెంట్‌లో.. రాజ్యాంగంలోని లౌకికవాదం అనే పదం తొలగిస్తామని చెప్పారు. అప్పుడు చంద్రబాబు సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు లౌకికవాద పరిరక్షణకు బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ కడుతున్నాం అంటున్నారు. మరి ఆ రోజు ఎందుకు వ్యతిరేకించ లేదు..?.

ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు ప్రకటిస్తేనే ప్రయోజనమా..?

రాహుల్‌ గాంధీ రాఫెల్ స్కాంపై మాట్లాడుతున్నారు కానీ.. చంద్రబాబు మాట్లాడటం లేదు. డిమానిటైజేషన్ పేరిట.. మళ్లీ క్యాష్ లెస్ అన్నారు.. కానీ ఇవాళ నగదు ప్రవాహం పెరిగింది. బ్యాంకింగ్ వ్యవస్థ దెబ్బతిన్నది. రూపాయి పతనం అవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలపై… ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలేమిటి..? సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల‌లో ఏ ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలతో కలుస్తున్నారనేది చెప్పకపోతే… కూటమిపై ప్రజలు స్పందించరు. దీని వల్ల బీజేపీ మరింత బలపడుతుంది. అందుకే.. ప్రజలకు చెప్పాలి.. ఎందుకు కలుస్తున్నారో చెప్పాలి. మోడీ కంటే.. తమ విధానాలు ఎంత మెరుగో ప్రజలకు చెప్పాలి. మోడీ చేసినట్లే.. అన్ని విధానాలు అనుసరించే పని అయితే.. కూటమికి ఎందుకు ఓటు వేయాలి..? బీజేపీకి… కాంగ్రెస్‌కి ప్రత్యామ్నాయంగా.. మరో పార్టీ లేదా కూటమి వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ.. ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. కీలకమైన మౌలిక విధానాలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే.. చివరికి మోడీ బలపడటానికే కారణం అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close