చంద్రబాబు తల్చుకున్నారు..! సీబీఐకి ఏపీలో పని ఉండదు..!!

“నేడో.. రేపో నాపై కూడా.. సీబీఐ దాడులు జరగొచ్చు.. కానీ నేను భయపడను..” ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తరచూ చెబుతున్నమాట ఇది. కానీ చంద్రబాబు ఇంకా ముందుకు ఆలోచించారు. అసలు సీబీఐకి దాడులు చేసే అవకాశం ఎందుకివ్వాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా… ఆదేశాలు జారీ చేసేశారు. దీని ప్రకారం… రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ అధికారులు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేరు. చివరికి… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై సోదాలు జరపాలన్నా సరే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాల్సిందే. రైల్వే పరిధిలోకి వచ్చే భూభాగాన్ని మినహాయిస్తే… ఇతరత్రా ఎక్కడ, ఎలాంటి సోదాలు నిర్వహించాలన్నా ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.

సీబీఐకి ఇప్పటి వరకూ ఉన్న అధికారాల ప్రకారం… ఏపీలో సీబీఐ నేరుగా రంగంలోకి దిగి చర్యలు తీసుకోవచ్చు. ఫస్ట్‌ గెజిటెడ్‌ స్థాయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైనా సీబీఐ చర్యలు చేపట్టవచ్చు. ఇందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎప్పుడో సీబీఐకి జనరల్‌ కన్సెంట్‌ ఇచ్చేశారు. దీనిని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు సీబీఐ ప్రత్యేకంగా… రాజకీయ వేట సాగిస్తూండటం … వివిధ సందర్భాల్లో ఏపీకి వచ్చే బీజేపీ నేతలు.. ఉద్యోగుల్ని కూడా బెదిరిస్తున్నట్లు మాట్లాడుతూండటంతో… ప్రభుత్వం పునరాలోచన చేసింది. సీబీఐ పేరుతో బెదిరింపుల్ని ఇెంకెంత కాలం భరించాలని ఆలోచించింది. వెంటనే..” జనరల్‌ కన్సెంట్‌” ను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తనంతట తాను కోరిన కేసుల్లో మాత్రమే సీబీఐ దర్యాప్తు జరపగలదు. లేదా… న్యాయస్థానం ఆదేశాలతో అడుగు పెట్టగలదు. అంతకుమించి… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపైనా సీబీఐ చర్యలు తీసుకోలేదు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ, సీఆర్పీసీ, ఇతరత్రా కేంద్ర ప్రభుత్వ చట్టాల కింద సీబీఐ తనంతట తాను కేసు నమోదు చేయలేదు.

తాజా ఉత్తర్వులతో ఏపీలోని కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై దాడి చేయడానికి సీబీఐకి అవకాశం ఉండదు. తాజా ఉత్తర్వుతో రాష్ట్రంలో దాడులు చేయడానికి సీబీఐకి పరిధి రద్దయింది. అంటే ఏపీలో ఐటీ అధికారులపై కూడా.. ఏసీబీ కేసులు పెట్టే అధికారం.. ఉందని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు టార్గెట్ గా చేస్తున్న ఐటీ దాడులపై.. చంద్రబాబు ఓ కన్నేశారు. దీని ప్రకారం.. ఐటీ అధికారులు అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తే… రాష్ట్రానికి చెందిన ఏసీబీ రంగంలోకి దిగి చర్యలు తీసుకునే అధికారం ఉందంని వాదించబోతున్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థల్ని ఉపయోగించుకుని.. రాజకీయ ప్రత్యర్థుల వేట సాగిస్తోంది. కొన్నాళ్లుగా ఏపీని, టీడీపీని టార్గెట్ చేసింది. వరసుగా… టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. ఈ రాజకీయ దాడుల్ని చూస్తూ ఊరుకోబోమని.. చంద్రబాబు ఈ ఉత్తర్వులతో స్పష్టం చేసినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close