ఆర్.కృష్ణయ్యకు మిర్యాలగూడ..! కూటమిలో టిక్కెట్ల ట్విస్టులు..!

కాంగ్రెస్ పార్టీ మరో ఆరుగురు అభ్యర్థుల్ని ప్రకటించింది. బీసీ సంక్షే మ సంఘం నేత ఆర్‌. కృష్ణయ్యకు కాంగ్రెస్‌ పార్టీ అనూహ్యంగా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించింది. టీడీపీ ఎల్బీ నగర్‌ నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే అయిన ఆర్‌. కృష్ణయ్య ఆదివారం సాయంత్రం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వెంటనే విడుదలైన జాబితాలో టిక్కెట్ ప్రకటించారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేయడానికి తనకు టిక్కెట్ ఇవ్వాలని కృష్ణయ్య అన్ని పార్టీలనూ సంప్రదించారు. కానీ కాంగ్రెస్ మాత్రం చివరికి మిర్యాలగూడ ఇచ్చింది. మడతపేచీ పడిన మిర్యాలగూడ సమస్యను పరిష్కరించుకోవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ఆ స్థానాన్ని కృష్ణయ్యకు కేటాయించిందని గాంధీ భవన్‌ వర్గాలు అంటున్నాయి.

అయితే ఇదే స్థానానికి టీజేఎస్‌ కూడా విద్యాధర్‌రెడ్డికి బీ ఫారం ఇచ్చింది. సికింద్రాబాద్ స్థానానికి మరో నేత కాసాని జ్ఞానేశ్వర్‌ కు బీఫాం ఇచ్చారు. ఈయన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అటు టీడీపీతోనూ సంప్రదింపులు జరిపారు, ఏ పార్టీ టిక్కెట్ ఇస్తే అక్కడ పోటీచేయాలనుకున్నారు. చివరికి కాంగ్రెస్సే టిక్కెట్ ఇచ్చింది. నారాయణపేట్‌ నుంచి వామనగారి కృష్ణ , నారాయణఖేడ్‌ – సురేష్‌ కుమార్‌ షెట్కర్‌ , కోరుట్ల నుంచి జువ్వాడి నర్సింగ్‌రావు, దేవరకద్ర నుంచి డాక్టర్‌ పవన్‌కుమార్‌రెడ్డి , వరంగల్ తూర్పు నుంచి గాయత్రి రవికి టిక్కెట్లు ప్రకటించారు. తను పోటీ చేయాలనుకున్న 95 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ప్రకటించినట్లయింది.

కూటమి కి తెలగాణ జన సమితి ట్విస్టులు ఇస్తోంది. ఆ పార్టీ ఆ పార్టీ మొత్తం 14 స్థానాల్లో నామినేషన్‌ వేయనుంది. 8 స్థానాలను అధికారికంగా కాంగ్రెస్ కేటాయించినా… అదనంగా మరో ఆరు స్థానాల్లోనూ బరిలోకి దిగాలని నిర్మయించారు. ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, చెన్నూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌, అశ్వారావుపేట స్థానాల్లోనూ తమ అభ్యర్థులతో నామినేషన్‌ వేయించాలని టీజేఏస్ నిర్ణయించింది. మహబూబ్‌నగర్‌, అశ్వారావుపేట స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించగా.. ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, చెన్నూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. నామినేషన్లకు నేడు ఆఖరి రోజు. ఈ రోజు… ఎంత మంది నామినేషన్లు వేస్తారోనన్నదానిపై .. కూటమిలో సీరియస్ నెస్ ఆధారపడి ఉందన్న అంచనాలు రాజకీయవర్గాలు వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

ఆ ఛానెల్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. డీప్ ఫేక్ ఆడియోతో పరువు నష్టం కలిగించారని ఓ న్యూస్ ఛానెల్ యాజమాన్యం, రిపోర్టర్ కు పువ్వాడ...

‘విశ్వంభ‌ర‌’లో ప‌వ‌న్‌.. అంత సీన్ ఉందా?

చిరంజీవి న‌టిస్తున్న సోషియో ఫాంట‌సీ చిత్రం 'విశ్వంభ‌ర‌'. వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష క‌థానాయిక‌. ఈ చిత్రంలో చిరంజీవి భీమ‌వ‌రం దొర‌బాబుగా, ఐదుగురు చెల్లెమ్మ‌ల‌కు అన్న‌య్య‌గా క‌నిపించ‌నున్నారు. దాదాపు 40...

HOT NEWS

css.php
[X] Close
[X] Close