సెప్టెంబర్ ఆరో తేదీన… తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. అసెంబ్లీని రద్దు చేశారు. ఆ రోజు గురువారం. రెండు రోజుల తర్వాత ఆదివారం రోజు… ఆంధ్రజ్యోతిలో.. వేమూరి రాధాకృష్ణ కొత్తపలుకు రాశారు. అందులో.. కేసీఆర్‌కు వంద సీట్లు ఖాయమని తేల్చారు. విపక్షాలు మహాకూటమిగా ఏర్పడి పోరాడినా.. 80 సీట్లు పక్కాగా వస్తాయని నిర్ధారించారు. చంద్రబాబు కూటమిలో కలవడం దండగని.. చెప్పడమే కాదు.. అలా చేస్తే.. కేసీఆర్.. వెంటాడి.. వేటాడి.. ఏపీలో ఓడిస్తారని హెచ్చరికలు కూడా చేశారు. అప్పటి “కొత్తపలుకు” చదివిన వారికి.. ఇక కారుకు ఎదురు లేదని డిసైడైపోయారు.
కానీ ఇప్పుడు.. పరిస్థితి తిరగబడింది. కేసీఆర్‌పై.. తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని.. ఆయన బయటపడటం కష్టమని… చెబుతున్నారు. నేటి కొత్త పలుకులోనూ… అదే చెప్పుకొచ్చారు ఆర్కే. లగడపాటి రాజగోపాల్.. స్వతంత్రులు ఎనిమిది నుంచి పది మంది వరకూ గెలుస్తారని ప్రకటించారు. వీరంతా కాంగ్రెస్ రెబెల్స్. అంటే.. టీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకతతో… కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబడిన వారు నచ్చనందున.. ఆ పార్టీకి చెందిన రెబల్స్‌కు కూడా.. ప్రజలు ఓట్లేస్తున్నారనేది .. ఆయన కొత్తపలుకులో తాజా విశ్లేషణ. వ్యతిరేకత స్థాయి ఇంత తీవ్రంగా ఉన్నందున.. కేసీఆర్ గట్టెక్కలేడని.. తనదైన పదాలతో.. పరోక్షంగా చెప్పినా..నేరుగా అర్థమయ్యేలా విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ ఓడిపవడానికి కారణంగా.. కేసీఆర్ కుటుంబమేనని కూడా తేల్చి చెబుతున్నారు. కేటీఆర్, కవితల అధికార దర్పంపై అసూయ పెరుగుతోందని.. ఫలితంగా.. వ్యతిరేకత పెరుగుతోందని తేల్చారు.
” తాజా సర్వే ఫలితాల ప్రకారం గ్రామీణప్రాంతాలలో ప్రజాఫ్రంట్‌కు ఆధిక్యం లభించే పరిస్థితి కనిపిస్తోంది. పట్టణప్రాంతాలలో కూడా పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్‌లో మెజారిటీ సీట్లు గెలుచుకునే పరిస్థితిలో ఉన్న తెరాసకు ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు…” ఇదీ.. ఒక్క ముక్కలో ఏబీఎన్ ఆర్కే తేల్చిన సారాంశం. మూడు నెలల కిందట.. ఆయన రాసిన కొత్తపలుకుకు.. దీనికి పూర్తిగా కాంట్రాస్ట్. ఈ మధ్య కాలంలో రాజకీయ మార్పులు వేగంగా మారిపోయాయా.. అంటే.. చెప్పలేం. అయితే.. ప్రత్యేకంగా తన రచనల గురించి కాకపోయినా.. పరోక్షంగా.. ఆనాటి తన పలుకుల వెనుక.. ఒత్తిడి ఉందని.. పలుమార్లు … అంగీకరించారు కూడా. మీడియాపై ఒత్తిడి చేసి .. అనుకూలంగా రాయించుకుంటే… పరిస్థితి నిజంగా అనుకూలంగా మారదని.. హితవు కూడా గతంలో పలికారు. అంటే.. ఇప్పుడు… తాను నిక్కచ్చిగా రాస్తున్నానని.. నమ్మవచ్చని కూడా.. ఆయన తన కొత్త పలుకు ద్వారా కొత్తగా చెప్పబోతున్నారు. మొత్తం ఆంధ్రజ్యోతి ఆర్కే ఎగ్జిట్ పోల్గా.. “కొత్తపలుకు” ఆర్టికల్‌ను తీసుకోవచ్చు. దీని ప్రకారం ప్రజాఫ్రంట్ … తెలంగాణ ఎన్నికల్లో ముందుంజలో ఉంది.