బీజేపీలోనే ఉంటా.. కానీ పోటీ చేయను.. : కామినేని శ్రీనివాస్‌

భారతీయ జనతా పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ .. సొంత పార్టీకి షాకిచ్చారు. అయితే ఆయన పార్టీ వీడిపోతానని చెప్పలేదు. కానీ పోటీ మాత్రం చేసేది లేదని తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లా కైకలూరు నుంచి బీజేపీ తరపున పోటీ చేసి.. టీడీపీ మద్దతుతో గెలిచిన కామినేని శ్రీనివాస్ .. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇతర బీజేపీ నేతలు.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నా… కామినేని మాత్రం ఎప్పుడూ టీడీపీపై విమర్శలు చేసే ప్రయత్నం చేయలేదు. పైగా.. అప్పుడప్పుడు చంద్రబాబుతో సమావేశం అవుతూ ఉంటారు.

దీంతో కామినేని శ్రీనివాస్ టీడీపీలో చేరుతారన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. ఈ విషయాన్ని ఆయన ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా.. తనకు బీజేపీని వీడే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు .. దాంతో పాటు.. పోటీ చేయనని కూడా చెప్పుకొచ్చేశారు. గతంలో పీఆర్పీ తరపున పోటీ చేసిన కామినేని శ్రీనివాస్.. వెంకయ్యనాయుడికి సన్నిహితునిగా పేరు ఉంది. ఆయన ఆశీస్సులతో గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కారణంగా.. లభించిన సీట్లలో కైకలూరును దక్కించుకున్నారు. టీడీపీ గాలిలో గెలిచేశారు. ఈ సారి భారతీయ జనతా పార్టీకి ఏపీలో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. పొత్తు పెట్టుకోవడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదు. లోపాయికారీ పొత్తులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నా.. కామినేని మాత్రం.. బీజేపీ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా లేరు.

ఒక్క కామినేని మాత్రమే కాదు.. మాణిక్యాలరావు, ఏంపీ హరిబాబు కూడా పోటీ చేయబోమని చెబుతున్నారు. దీంతో బీజేపీ నేతలకు పోటీపై వైరాగ్యం వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పొత్తులున్నప్పుడు టిక్కెట్ దక్కించుకుని పోటీ చేసి.. డిపాజిట్లు రావని తేలినప్పుడు.. పోటీకి దూరం ఉండటం ఏమిటన్న విమర్సలు సొంత పార్టీ క్యాడర్ నుంచే వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close