ఆకాశ‌వాణి’ బ‌డ్జెట్ ఎంత – విల‌న్ ఎవ‌రు?

రాజ‌మౌళి క‌ల‌లన్నీ భారీగా ఉంటాయి. వంద‌ల కోట్లు లేక‌పోతే రాజ‌మౌళి సినిమా పూర్తి కావ‌డం లేదు. అయితే ఇప్పుడు త‌న‌యుడు కార్తికేయ నిర్మాత‌గా మారుతున్నాడు. ‘ఆకాశ‌వాణి’ సినిమాతో. రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా బ‌డ్జెట్ ఎంత‌నున్నారు..? కేవ‌లం రూ.4 కోట్లు. ఓ కొత్త క‌థాంశంతో, ప‌రిమిత బ‌డ్జెట్‌లో ఈ సినిమాని పూర్తి చేయాల‌న్న‌ది కార్తికేయ ప్లాన్‌. రూ.4 కోట్ల‌కు ఒక్క రూపాయి కూడా మించ‌కుండా… కాస్త క‌ట్టుదిట్టంగా షెడ్యూల్స్ వేసుకున్నార్ట‌. రాజ‌మౌళి త‌న‌యుడి సినిమా కాబ‌ట్టి.. మార్కెటింగ్‌, ప‌బ్లిసిటీ ఆ స్థాయిలోనే ఉంటుంది. విడుద‌ల‌కు ముందే… భారీ టేబుల్ ప్రాఫిట్‌తో సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోవాల‌ని కార్తికేయ భావిస్తున్నాడు. కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ ఈ చిత్రంతో సంగీత దర్శ‌కుడి అవ‌తారం ఎత్త‌బోతున్నాడు.

ఇందులో హీరోలు, విల‌న్లు ఎవ‌రూ ఉండ‌రు. పాత్ర‌లే క‌థ‌ని న‌డిపిస్తాయి. క‌థే పాత్ర‌ల్ని మోస్తుంటుంది. అయితే… నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్ర ఒక‌టి ఇందులో కీల‌కం. ఆ పాత్ర‌లో ఓ స్టార్ హీరో క‌నిపిస్త బాగుంటుంద‌ని కార్తికేయ భావించాడు. అయితే బ‌డ్జెట్ ప‌రిమితుల వ‌ల్ల‌… ఆ ప్ర‌తిపాద‌న ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. సాయికుమార్ సోద‌రుడు, ప్ర‌ముఖ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్, న‌టుడు ర‌విశంక‌ర్ కి ఆ ఛాన్స్ దొరికిన‌ట్టు తెలుస్తోంది. మిగిలిన న‌టీన‌టుల వివ‌రాల్ని త్వ‌ర‌లోనే చిత్ర‌బృందం ప్ర‌క‌టిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close