నోళ్లకు తాళాలు వేసుకుంటున్న గ్రేటర్‌ ప్రచారకర్తలు

రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే నాయకుల నోటి దూకుడుకు ఇప్పుడు కళ్లెం పడుతోంది. ఎందుకైనా మంచిది.. ఎన్నికల సంఘం కన్నెర్ర చేయకముందే.. నోటికి తాళాలు వేసుకోవడం మంచిదని నాయకులు అనుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌లో జరుగుతున్న ఎన్నికలలో ప్రచార నిమిత్తం అన్ని పార్టీల నాయకులు ప్రజలనుద్దేశించి చేస్తున్న ప్రసంగాలను ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే కొంత మంది నేతలు ఇది మా నియోజక వర్గమే కదా ఇక్కడ నాకు తప్ప వేరే పార్టీకి ఓటు వేయకూడదనే ధోరణిలో ప్రసంగాలనే కాకుండా నాయకులను, ప్రజలను కూడా అసౌకర్యానికి గురిచేస్తున్న నేపధ్యంలో ఎన్నికల అధికారులు వారి ప్రసంగాలను , వీడియోలను ఎక్కడ ఏ నాయకుడు ఏ విధంగా మాట్లాడాడు, అతడు ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడాడా లేకా మామూలుగానే మాట్లాడాడా అనే విషయాలను పరిశీలించి తద్వారా చర్యలను తీసుకోనున్నారు. అందువల్ల ఇప్పటి నుండి ఇక ఏ నేతలైనప్పటికీ తమ నోటిని కొంచెం అదుపులో ఉంచుకొని హామీలను గానీ, మాటలను గానీ మాట్లాడేదుంటుందనీ పరిశీలకులంటున్నారు.

ఎందుకంటే ఇంతకు ముందు కూడా కొంత మంది నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు అనే నేపధ్యంలో వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ సారి కూడా కొన్ని పార్టీలకు సంబందించిన నాయకులు మాట్లాడినట్టుగా వినికిడి. కానీ అటువంటి వారిని అది మొదటి తప్పుగా వదిలేస్తారో లేక దానిని కూడా పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి.

హోదా, డబ్బు, మంది, మార్బలం ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రజల మనోభావాలను చెడగొట్టేవిధంగా మాట్టాడితే ఇక తను ప్రజల మద్దతుతో ప్రజల మధ్య తిరగవలసింది పోయి, హాయిగా చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినవలసిన పరిస్థితి వస్తుందనీ ప్రజా సంఘాలు అంటున్నాయి. కాబట్టీ నేతలు జర జాగ్రత్త అదుపు అదుపు మాట పొదుపు అనుకుంటూ నాయకులు ముందుజాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close