ప్రణబ్‌ ట్రూత్‌ స్పీకింగ్‌

Telakapalli-Raviరాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గత చరిత్రకు సంబంధించి వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు అనుభవాలు కాంగ్రెస్‌ బిజెపిలకు ఇరకాటంగా పరిణమిస్తున్నాయి. మామూలుగా అధినేతలు పదవీ కాలం ముగిశాక జ్ఞాపకాలు ఆత్మకథలు రాస్తుంటారు. కాని ప్రణబ్‌ పదవిలో వుంటూనే ఆ పని మొదలు పెట్టారు. పైగా నిర్మొహమాటంగా గతంపై తన అంచనాలు చెబుతున్నారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత తాత్కాలికంగా తనను ప్రధాని పదవి తీసుకోమని చెబితే నిరాకరించానని రెండవ సంపుటంలో రాశారు. పైగా రాజీవ్‌గాంధీని పూర్తిస్థాయి ప్రధానిగా నియమించాలని కోరుతూలేఖ తానే రూపొందించానని తెలిపారు. తను పదవి కోరలేదు గనక ఆ కారణంగా తనకూ రాజీవ్‌గాంధీకి మధ్య దూరం పెరిగిందనే వాదన నిజం కాదని తెలిపారు. తల్లిపై హత్యాప్రయత్నం వార్త తెలిశాక రాజీవ్‌ ఎలా ప్రవర్తించారో కూడా ప్రణబ్‌ వివరంగా తెలిపారు. రాజీవ్‌ కొన్ని పొరబాట్లు చేసి వుండొచ్చునంటూనే తను కూడా అంతేనని పేర్కొన్నారు. అయోధ్యలో బాబరీ మసీదు తలుపులు తీయడం రాజీవ్‌ పొరబాటనీ, షాబానూ కేసులో చట్ట సవరణ మరో తప్పిదమనీ తెలిపారు. అయితే బాబరీ మసీదు విధ్వంసం మోసపూరితమని బిజెపిని తప్పుపట్టారు. మొత్తంపైన ఆయన కీలకమైన అంశాలపై తన అబిప్రాయాలు ముందే వెల్లడించాలని భావించడం విశేషమే. ఈ బెంగాలీ దాదా మరెన్ని సత్యాలు బయిటపెడతారో కనిపెట్టి చూస్తుండాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close