విశ్లేషణ: మహిళామంత్రి టాపిక్‌ ఎందుకు ఎత్తారంటే?

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సింహాసనం అధిష్ఠించి దాదాపుగా ఒకటిన్నర ఏడాది పూర్తి కావస్తోంది. ఆయన కేబినెట్‌ కూడా అప్పుడే ఏర్పడింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి తొలి కేబినెట్‌ అన్నమాట. అలాంటి ప్రతిష్ఠాత్మక కేబినెట్‌లో ఒక్కరంటే ఒక్క మహిళ కూడా లేరంటే ఎంత అవమానకరమైన విషయం! తెలంగాణ ప్రభుత్వంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి, ఒక శాఖను నిర్వహించడానికి ఒక్కరంటే ఒక్క మహిళ కూడా లేకుండా పోయారా? పది జిల్లాల్లో ఒక్క మహిళను కేసీఆర్‌ మంత్రిగా చేయలేకపోయారంటే.. అది తెలంగాణ మహిళా సమాజానికి సిగ్గు చేటు. ఈ విషయంలో కేసీఆర్‌ తీరు మీద గతంలో (తొలినుంచి) తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. అయితే ఆయన కనీసం ఆ విమర్శలను ఎన్నడూ పట్టించుకోలేదు కూడా. సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. బతుకమ్మకు తమ ప్రాధాన్యం అని చెప్పే కేసీఆర్‌.. ఒక్క మహిళను మంత్రిగా చేయలేకపోయారు. దీని మీద సుప్రీం కోర్టు స్థాయిలో కేసులు నడిచి, పరువు రచ్చకెక్కినా ఆయన మాత్రం పట్టించుకోలేదు.

అయితే తొలిసారిగా కేసీఆర్‌.. గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో మహిళా మంత్రి లేకపోవడంపై పెదవి విప్పారు. ఆయనేమీ మహిళలకు అవకాశం ఇస్తా అని చెప్పడం లేదు. ఎందుకు లేరో మాత్రం చెబుతున్నారు. కేబినెట్‌లో మహిళలు ఒకరైనా ఉండాలనే సంగతి రాజ్యాంగంలో ఎక్కడా లేదని కేసీఆర్‌ అంటున్నారు. అయినా అసలు కేబినెట్‌లో కులాల తూకం పాటించాలని రాజ్యాంగంలో ఉన్నదా? మహిళలకు చోటు ఇవ్వాలని రాజ్యాంగంలో లేదు కదా.. అని చాలా నిర్మొహమాటంగా.. తన అహంకారాన్ని చాటుకుంటున్నారు.

అయినా ఇంతకూ ఇన్నాళ్లూ ఎన్ని విమర్శలు వచ్చినా ఈ మహిళా మంత్రి వ్యవహారంపై పెదవివిప్పని నాయకుడు, ఇప్పుడే ఎందుకు మాట్లాడారనేది కీలకం. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నది.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో. కేసీఆర్‌ మహిళా వ్యతిరేకి అనే ప్రచారం ప్రజల్లోకి వెళితే.. ఇక్కడ పార్టీకి నష్టం జరుగుతుంది. జిల్లాల్లో, చిన్న ఊళ్లలో చదువులేని సామాన్య మహిళలను అయితే.. టూబెడ్‌రూం ఇళ్లు మీ పేరిట ఇస్తాం.. పథకాలు ఆడాళ్ల పేరు మీద ఉంటాయి.. అనే మాయ మాటలతో బుకాయించడం సాధ్యమవుతుంది గానీ.. నగరంలో అలా కుదరదు. ఇక్కడ విద్యావంతులైన ఆలోచనాపరులైన మహిళలు పెద్దసంఖ్యలో ఓటర్లుగా ఉంటారు. వారిలో కేసీఆర్‌ మహిళా వ్యతిరేకత మీద ఒక ముద్ర పడితే.. అది కారు గుర్తు మీద రిఫ్లెక్ట్‌ అవుతుంది. అందుకే ఆయన నగర ఎన్నికల సమయంలో మాత్రం తొలిసారిగా మహిళా మంత్రి లేకపోవడం గురించి సంజాయిషీ చెప్పుకుంటున్నారు.

అయినా.. మహిళలకు కేబినెట్‌లో చోటు ఇవ్వాలని రాజ్యాంగంలో లేదు కదా అని కేసీఆర్‌ అనడం చూస్తోంటే ఓ సినిమా జోకు గుర్తుకు వస్తోంది. ‘మిర్చి’ సినిమాలో.. ”అన్నయ్య ఫ్రెండ్‌ అన్నయ్యే అవుతాడు కదమ్మా” అంటూ రిచా గంగోపాధ్యాయ్ ను బ్రహ్మానందం అడుగుతాడు. అతడి చెంప ఛెళ్లు మనిపించి.. ”అలా అని రాజ్యాంగంలో రాసుందా” అని అడుగుతుంది రిచా గంగోపాధ్యాయ్.
అచ్చం ఇప్పుడు కేసీఆర్‌ అడుగుతున్నట్లే!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close