బాబు లాక్కున్న ఎమ్మెల్యేల ప్రస్తావన లేకుండా విలీనాలపై ఏబీఎన్ ఆర్కె నీతి వచనాలు

ఏబీఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు వ్రాశారు. కెసిఆర్ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలని టిఆర్ఎస్ లోకి విలీనం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. శాసనసభలో కూడా ఇలాంటివి వ్యూహాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో “విలీన క్రీడ విలువలకు పీడ” అంటూ ఏబీఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు పలికారు. ఆయన కొత్త పలుకు లోని ప్రధాన అంశాలు ఇవి:

  • ఒకప్పుడు చట్టసభల స్పీకర్లు స్వతంత్రంగా ఉండేవారు కానీ ఇప్పుడు వారు ప్రభుత్వాన్ని చేతుల్లో మరబొమ్మలు గా మారిపోయారు
  • కెసిఆర్ కి 2014లో బొటాబొటి మెజారిటీ వచ్చింది అందువల్ల ఫిరాయింపుల పట్ల ప్రజల్లో కూడా పెద్ద వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఇంత మెజారిటీ వచ్చాక కూడా ఫిరాయింపులు చేయాల్సిన అవసరం ఏంటి
  • ఈ రాజకీయ క్రీడలో అన్ని పార్టీలు పాలుపంచుకున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి ఇలాంటి విలీన క్రీడలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి ప్రజాస్వామ్యానికే ప్రమాదం.

ఏబిఎన్ ఆర్కే కొత్త పలుకు ప్రధాన అంశాలు ఇవి.

అయితే ఈ కొత్త పలుకులో ఎన్నో నీతి వచనాలు వల్లించిన ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబు గారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకొని, ఎన్నికలకు వెళ్లకుండానే వారికి మంత్రి పదవులు సైతం ఇచ్చిన విషయాన్ని చాలా కన్వీనియంట్ గా గుర్తుంచుకొని మరీ మర్చిపోయారు. పివి నరసింహారావు దగ్గర నుండి, రాజశేఖరరెడ్డి వరకు, ఇతర రాష్ట్రాల్లో బిజెపి వ్యవహరిస్తున్న తీరు నుండి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకుంటున్న కెసిఆర్ వరకు అందరినీ ప్రస్తావించి, అందరినీ విమర్శించిన రాధాకృష్ణకు, చంద్రబాబు వైకాపా ఎమ్మెల్యేలను లాక్కున్న విషయంపై మాత్రం నోరెందుకు పెగలలేదని ఆయన వ్యాసాన్ని చదివిన వారికి అనిపించక మానదు.

అలాగే ఈ కొత్త పలుకులో రాధాకృష్ణ గారు రాసిన మరొక పాయింట్ ఏమిటంటే, ఇటీవల కేసీఆర్ తనయుడు కేటీఆర్ మీడియా ఎలా ఉండాలి అన్న అంశంపై సుధీర్ఘంగా మాట్లాడారని, ఇది చూస్తుంటే రాజకీయ నాయకులతోపాటు మీడియా కూడా అధికార పార్టీకి గులాంగిరి చేయవలసిందేనా అనిపిస్తుంది అంటూ రాధాకృష్ణ ప్రశ్నించారు. అయితే రాధాకృష్ణ గారి ప్రశ్నలో ఆవేదన కంటే భయమే ఎక్కువగా ఉందని అనిపిస్తే అది పాఠకుల తప్పు కాదు. ఎన్నికల ఫలితాల విడుదల ముందు వరకు ఏబీఎన్ కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ మహా కూటమిని ఏ స్థాయిలో మోశాయో ప్రజలకు తెలియంది కాదు. నిష్పక్షపాతంగా ఉంటూ ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించాల్సిన మీడియా అయి ఉండి ఒక పార్టీని విపరీతంగా మోసి, ప్రజా కూటమి గెలుస్తోందంటూ రకరకాల కథనాలు ఈ పత్రికలో రాసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు టిఆర్ఎస్ పార్టీని విపరీతంగా పొగిడి, సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబు కోసం యూటర్న్ తీసుకుని ప్రజా కూటమికి ఆంధ్రజ్యోతి పత్రిక విపరీతమైన హైప్ ఇచ్చిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. ఆయనే ఇదే వ్యాసంలో వేరొక సందర్భంలో రాసినట్టు, ప్రజల చేతికి ఉన్న సిరా గుర్తు కూడా ఇంకా మాసిపోలేదు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజలు టీఆర్ఎస్ వైపే నని, కూటమి మీడియా హైపే నని అందరికీ అర్థం అయింది.

Click here for : ప్రజలు టిఆర్ఎస్ వైపే, కూటమి మీడియా హైపే!

కెసిఆర్ నియంతృత్వ పోకడలు పోవడం నిజానికి తప్పే. కానీ కెసిఆర్ కి నీతి వచనాలు వల్లిస్తూ రాధాకృష్ణ వ్రాసిన వ్యాసం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. అందుకు రెండు కారణాలు – ఒకటి- ఫిరాయింపులు, విలీనాల పై అన్ని పార్టీలకు నీతి వచనాలు చెబుతూ తాము వంతపాడే తెలుగుదేశం పార్టీ లాక్కున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేల గురించి ప్రస్తావించకపోవడం, రెండు – ఎన్నికల ముందు ఒక పార్టీకి కరపత్రం లాగా కథనాలు రాసి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి, దానికి ఎదురవుతున్న ప్రమాదం గురించి వీరే మాట్లాడడం.

– జురాన్ ( @CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డ‌బుల్ ఇస్మార్ట్‌: ఈసారి ‘చిప్‌’ ఎవ‌రిది?

పూరి జ‌గ‌న్నాథ్ రాసుకొన్న‌ డిఫరెంట్ క‌థ‌ల్లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఒక‌టి. హీరో మెద‌డులో చిప్ పెట్టి - దాని చుట్టూ కావ‌ల్సినంత యాక్ష‌న్, డ్రామా, వినోదం న‌డిపించేశారు. ఆ పాయింట్ కొత్త‌గా అనిపించింది....

ఉరవకొండ రివ్యూ : మరోసారి పయ్యావుల కేశవ్‌కే కిరీటం

ఉరవకొండలో పయ్యావుల గెలిస్తే టీడీపీ ఓడిపోతుందన్న ఓ ప్రచారాన్ని ఆయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కానీ పయ్యావుల రాజకీయాల్లోకి వచ్చిన 1994లో టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కూడా గెలిచారు. ఆ తర్వతా...

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close