ప‌వ‌న్ గాజు గ్లాసు గురించి.. చ‌ర‌ణ్ ఏమ‌న్నాడు..?

మెగా కుటుంబంలో ఎవ‌రి ఫంక్ష‌న్ జ‌రిగినా, ఎవ‌రు మైకు ప‌ట్టుకున్నా… ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ఒక్క ముక్క అయినా మాట్లాడాల్సిందే. లేదంటే… అదేదో వెలితిగా ఉంటుంది. ఫ్యాన్స్ కూడా ప‌వ‌న్ గురించి మాట్లాడ‌క‌పోతే అస్స‌లు ఒప్పుకోరు. ‘విన‌య విధేయ రామ‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లోనూ ఈ గోల, గొడ‌వ క‌నిపించింది. చ‌ర‌ణ్‌, చిరు.. ఆఖ‌రికి కేటీఆర్ మాట్లాడుతున్న‌ప్పుడు కూడా `ప‌వ‌ర్ స్టార్‌.. ప‌వర్ స్టార్‌` అంటూ పెద్ద ఎత్తున అరిచారు అభిమానులు. చ‌ర‌ణ్ కూడా వాళ్ల‌ని నిరుత్సాహ‌ప‌ర‌చుకుండా ప‌వ‌న్ గురించి మాట్లాడాడు. ఈమ‌ధ్య ‘జ‌న‌సేన‌’కు టీ గ్లాసు గుర్తుని ఎన్నిక‌ల సంఘం కేటాయించిన సంగ‌తి తెలిసిందే. ఆ గ్లాసు గురించి నిండు స‌భ‌లో చ‌ర‌ణ్ ప్ర‌స్తావించ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

‘‘ఈ మధ్య ఎవరూ జ్యూస్‌లు, కాఫీలు తాగడం లేదు. అందరూ టీలే తాగుతున్నారు. ఓ చిన్న టీ కప్పు ఏదో ఒక పెద్ద పని సృష్టిస్తుందని అనిపిస్తోంది. మా బాబాయ్‌ సినిమాలన్నీ వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం యుద్ధం చేస్తూ ఇంటింటికీ వెళ్లి తిరుగుతున్నారు. ఓ వైపు ఆనందంగా ఉంది. మరోవైపు ఇంత కష్టపడుతున్నారనే బాధ కూడా ఉంది. దాని కంటే ఇతరుల బాధను తీర్చే ఓ వ్యక్తి మా కుటుంబం నుంచి వచ్చారనేది చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని బాబాయ్‌ని గుర్తు చేసుకున్నాడు రామ్ చ‌ర‌ణ్‌.

కేటీఆర్ మాట్లాడుతున్న‌ప్పుడూ ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ”కల్యాణ్ ఇక్క‌డ లేరు. కానీ ఈమ‌ధ్య మేం రెండు మూడు సార్లు మాట్లాడుకున్నాం. త‌న సినిమాల్లోనే కాదు.. రాజ‌కీయాల్లో్నూ రాణించాల‌”ని ఆకాంక్షించారు కేటీఆర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.