కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే రాష్ట్రాలు కూడా అవే పెట్టాలా..?

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల తెలంగాణ ప్రభుత్వం కొన్ని విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. అందులో ఒకటి .. బడ్జెట్. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలా..? లేక పరిమితమైన బడ్జెట్ పెట్టాలా అన్నది.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే… మార్చి, ఏప్రిల్‌లో.. సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి.. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం లేదు. మహా అయితే.. ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని భావిస్తున్న మే నెల వరకూ.. మాత్రమే… జమాఖర్చుల లెక్కలను ఓటాన్ అకౌంట్ రూపంలో పెట్టగలరు. ఆ తర్వాత కొత్తగా వచ్చే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతుంది. ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. సాధారణంగా లోక్‌సభతో పాటు.. అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే.. ఈ సమస్య వచ్చేది కాదు. కానీ ఇప్పుడు.. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకునే అవకాశం ఉండేలా.. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వ వెర్షన్ ప్రకారం… తాము కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలనే ఆలోచనే చేస్తోంది.

కేంద్రం బడ్జెట్ పెడితే.. రాష్ట్రాలకు ఏమిస్తుందో తెలుస్తుందని.. వాటి ఆధారంగా బడ్జెట్ లెక్కలు వేసుకుంటామని.. ఇప్పుడా అవకాశం లేదు కాబట్టి ఓటాన్ అకౌంట్ పెట్టాలనుకుంటున్నామని.. చెబుతున్నారు. అయితే.. ఈ లెక్కన చూస్తే.. అన్ని రాష్ట్రాలు.. అదే పద్దతి ఫాలో కావాలి. కానీ ఇంత వరకూ ఏ రాష్ట్రమూ.. ఇలా తమకు పూర్తి స్థాయి పాలనా కాలం ఉన్న సమయంలో ఓటాన్ అకౌంట్ తో సరిపెట్టిన పరిస్థితి లేదు. ఇలా పెడితే.. టీఆర్ఎస్ ప్రభుత్వం మరో సంప్రదాయం నెలకొల్పినట్లవుతుంది. కానీ విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. కేంద్రం పెట్టే బడ్జెట్ అయినా.. రాష్ట్రాలు పెట్టే బడ్జెట్ అయినా.. ఎంత ఆదాయం వస్తుందో అంచనా వేసుకుని ప్రకారం వేసుకునే ప్రణాళికే. ఆదాయానికి తగ్గట్లుగా బడ్జెట్ అంచనాలు మార్చుకుంటూనే ఉంటారు. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టి.. ఆ తర్వాత కేంద్రం బడ్డెట్ తర్వాత అంచనాల్లో మార్పులుంటే చేసుకోవచ్చు.

ఈ సంగతి తెలిసినా.. ఓటాన్ అకౌంట్ గురించే కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తే.. అది కచ్చితంగా విపక్ష పార్టీల నుంచి వచ్చే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. పూర్తి స్థాయి బడ్జెట్ పెడితే.. ఎన్నికల హామీల కోసం.. నిధుల కేటాయింపుల చేయాలి. ఏక మొత్తంలో రూ. లక్ష రుణమాఫీకి రూ. 25 వేల కోట్లు , రైతు బంధు పథకానికి దాదాపుగా పద్దెనిమిది వేల కోట్లతో పాటు.. మేనిఫెస్టోలో ప్రకటించిన ఇతర హామీల కోసం.. మరో ముఫ్పు, నలభై వేల కోట్ల కేటాయింపు చేయాలి. అలాగే ప్రాజెక్టులకు మరో పాతిక వేల కోట్లు కేటాయింపులు చూపించాలి. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఏ మాత్రం తక్కువ చూపించినా .. ఎన్నికల ముందు అదో ఇష్యూ అయిపోతుంది. ఈ బాధ అంతా ఎందుకని.. ఓటాన్ అకౌంట్ వైపే.. ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close