అంతా ఈవీఎంల వల్లే..! ఓటమిని అంగీకిరంచలేకపోతున్న టీ కాంగ్రెస్ అగ్రనేతలు..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తమ ఓటమి దిగ్భ్రాంతి నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. నిఖార్సుగా సమీక్షలు చేద్దామని కూర్చుంటే.. వారి కళ్ల ముందు ఈవీఎంలే కనిపిస్తున్నాయి.హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో సమావేశమైన.. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు.. ఎక్కడెక్కడ.. ఎలా ఓడిపోయారన్నది విశ్లేషించుకుంటే.. మొదటగా.. అందరూ చెప్పిన కారణం ఈవీఎంలే. అందుకే… ఈవీఎంల ట్యాంపరింగ్‌పై హైకోర్టుకు వెళ్తాం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా సమావేశం తర్వాత ప్రకటించారు. ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి, అధికార దుర్వినియోగంతో కేసీఆర్ గెలిచారని ఆరోపించారు.

ఓట్ల తొలగింపుపై ఎన్నికల తర్వాత అధికారులు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. ధర్మపురి, కోదాడ, ఇబ్రహీంపట్నంలో ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని .. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అక్రమాలపై కమిటీ ఏర్పాటు చేస్తామని కుంతియా స్పష్టం చేశారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు దొరికిన కలెక్టర్లపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ధర్మపురి, ఇబ్రహీంపట్నం, కోదాడలో టీఆర్‌ఎస్‌ అక్రమంగా గెలిచిందని తేల్చారు. వీవీ ప్యాట్స్ స్లిప్పుల లెక్కింపును సీఈవో ఎందుకు అంగీకరించడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.పంచాయతీ, పార్లమెంట్‌ ఎన్నికలపై సమావేశంలో చర్చించామని పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై పోరాటం చేస్తామన్నారు ఉత్తమ్‌.

పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో… అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కోలుకోలేకపోతోంది. ఇప్పటికీ… ఏ మాత్రం ఉపయోగం ఉండదని తెలిసినా.. ఈవీఎంల మీద నిందలేసి… తమకు తాము సర్దిచెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి… ఓ మాదిరి పోటీ అయినా ఇచ్చే ప్రయత్నాలు మాత్రం ఇంకా ప్రారంభించలేదు. కనీసం .. ఆ విషయంపై సమీక్ష కూడా చేయలేకపోతున్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే పరిస్థితులే టీ కాంగ్రెస్ లో కనిపించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close