బ‌న్నీ సంక్రాంతి సంబ‌రాలు @ పాల‌కొల్లు

మెగా కుటుంబానికీ పాల‌కొల్లుకీ మంచి అనుబంధం ఉంది. అల్లు రామ‌లింగ‌య్య సొంత ఊరు అది. ఆ ప‌క్క‌నే చిరు పుట్టినూరు మొగ‌ల్తూరు కూడా ఉంది. మెగా ఫ్యామిలీ అప్పుడ‌ప్పుడూ పాల‌కొల్లు, మొగ‌ల్తూరు వెళ్తొస్తుంటుంది. ఈసారి అల్లు అర్జున్ త‌న సంక్రాంతి పండగ పాల‌కొల్లులోనే చేసుకోబోతున్నాడు. బ‌న్నీ మేన‌మామ‌లు, బాబాయ్‌లూ పాల‌కొల్లులోనే స్థిర‌ప‌డ్డారు. అందుకే బ‌న్నీ ఈసారి అక్క‌డే పండ‌గ చేసుకోవాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. సాధార‌ణంగా బ‌న్నీ పండ‌గ‌ల‌న్నీ అత్తింట్లోనే జ‌రుపుకుంటుంటాడు. ఈసారి వెరైటీగా పుట్టిన ఊరు వెళ్తున్నాడ‌న్న‌మాట‌. పాల‌కొల్లు, భీమ‌వ‌రం చుట్టు ప‌క్క‌ల ఊళ్ల‌లో కోడి పందాల‌కు భ‌లే ఫ్యామ‌స్‌. సంక్రాంతి సీజ‌న్ మొద‌ల‌వ్వ‌గానే కోడి పందాలు చూడ్డానికి… సుదూర ప్రాంతాల నుంచి భీమ‌మ‌రం వెళ్తుంటారు. ఈసారి బ‌న్నీ అక్క‌డే ఉంటాడు క‌దా. స‌ర‌దాగా అటువైపు కూడా ఓ లుక్కు వేస్తాడేమో చూడాలి. తిరిగొచ్చాక‌.. త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీ అవ్వ‌బోతున్నాడు బ‌న్నీ. సినిమా సినిమాకీ త‌న లుక్ మార్చ‌డం బ‌న్నీ ఆన‌వాయితీ. ఈసారీ కొత్త లుక్‌లోనే క‌నిపించ‌నున్నాడ‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close