ఎన్టీఆర్ ‘మిస్సింగ్‌’పై క‌ల్యాణ్ రామ్ చెప్పింది నిజ‌మే గానీ..!

‘ఎన్టీఆర్’ బ‌యోపిక్‌లో ఆయ‌న మ‌న‌వ‌డు ‘ఎన్టీఆర్‌’ కూడా ఉంటే బాగుంటుంద‌న్న‌ది నంద‌మూరి అభిమానుల ఆశ‌. ఈ బ‌యోపిక్ మొద‌లెడుతున్న‌ప్పుడు అంద‌రి చ‌ర్చా దాని గురించే. అయితే ఎన్టీఆర్ లేకుండానే బ‌యోపిక్ పూర్త‌యిపోయింది. అయితే ‘ఎన్టీఆర్‌’ ఆడియో ఫంక్ష‌న్‌కి జూనియ‌ర్ రావ‌డం.. ఆ లోటుని కాస్త వ‌ర‌కూ తీర్చ‌గ‌లిగింది. ‘ఆడియో ఫంక్ష‌న్ త‌మ్ముడి చేతుల మీదుగా జ‌రిగింది. తార‌క్‌కి బాబాయ్ ఇచ్చిన గౌర‌వం అది. అంత‌కంటే కావ‌ల్సింది ఏముంది? ఉన్నాడు క‌దా అని ఏదో పాత్ర ఇవ్వ‌లేం క‌దా, అస‌లు బాబాయ్ బాల‌కృష్ణ పాత్రే బ‌యోపిక్‌లో లేదు’ అంటూ… క‌ల్యాణ్ రామ్ ఈ ప‌రిస్థితిని కాస్త స్థిమితం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. క‌ల్యాణ్ రామ్ మాట‌ల్లోనూ నిజం ఉంది. నిజంగా ఎన్టీఆర్‌ని ఇరికించి, ఓ చిన్న పాత్ర అప్ప‌గిస్తే… `చిన్న పాత్ర ఇచ్చి చేతులు దులుపుకున్నారు` అనేవారు.

కాక‌పోతే.. `ఈ బ‌యోపిక్‌లో చిన్న ఫొటో లో అయినా క‌నిపించినా చాలు` అంటూ క‌ల్యాణ్ రామ్ ప‌దే ప‌దే చెబుతున్నాడు క‌దా..? ఆ అవ‌కాశం త‌న త‌మ్ముడికి ద‌క్క‌కుండా పోయింది క‌దా? ఎన్టీఆర్ యుక్త వ‌య‌సు పాత్ర‌ని జూనియ‌ర్ తో చేయిస్తే బాగుంటుంద‌న్న‌ది అంద‌రి అభిప్రాయం. ఈ ఆలోచ‌న బాల‌కృష్ణ‌కు రాకుండా పోయింది. నిజంగా బాల‌య్య కూడా అలా ఆలోచిస్తే.. నిజంగానే జూనియ‌ర్‌కి ఈ బ‌యోపిక్‌లో మంచి స్థాన‌మే ద‌క్కేది. ఎన్టీఆర్ కూడా `బాబాయ్ పిలిస్తే త‌ప్ప‌కుండా చేస్తా` అని చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు. కానీ.. బాల‌య్య చెవికి ఆ మాట‌లు సోక‌లేదు. ఆడియో ఫంక్ష‌న్ కి ఎన్టీఆర్ రావ‌డం.. త‌ను కూడా ఈ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వామ్యం కావ‌డం ఒక్క‌టే తార‌క్ అభిమానుల్ని ఊర‌డించే విష‌యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

ఓటేస్తున్నారా ? : ఒక్క సారి మద్యం దుకాణాల వైపు చూడండి !

అనగనగరా ఓ ఊరు. ఆ ఊరిలో ఓ పాలకుడు. అక్కడ అతను చెప్పిందే కొనాలి. అతను చెప్పిందే తాగాలి . అంతా అతని దుకాణాలే ఉంటాయి. ఆ దుకాణాల్లో అమ్మేవి తాగి చచ్చిపోతే...

కోవిషీల్డ్ …డేంజరేనా..?

కరోనా విజృంభణ సమయంలో ప్రాణాలు కాపాడుతాయని నమ్మి వేసుకున్న వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వ్యాక్సిన్ లో లోపాలు ఉన్నాయని వ్యాక్సిన్ వేసుకున్న పలువురు చెప్తూ వచ్చినా మొదట్లో కొట్టిపారేసిన బ్రిటన్ ఫార్మా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close