వి.వి.రా’ కి.. అదే కాస్త ఇబ్బంది!

ఈ సంక్రాంతి బ‌రిలో నిలిచిన రామ్‌చ‌ర‌ణ్ చిత్రం ‘విన‌య విధేయ రామ‌’. ఈ సీజ‌న్‌లో రాబోతున్న పూర్తి స్థాయి మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఇది. అంచ‌నాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. యు బై ఏ స‌ర్టిఫికెట్‌తో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సంక్రాంతి సినిమా, అందులోనూ రంగ‌స్థ‌లం త‌ర‌వాత చ‌ర‌ణ్ నుంచి వ‌స్తున్న సినిమా.. కాబ‌ట్టి తిరుగులేని ఓపెనింగ్స్‌తెచ్చుకోవ‌డం ఖాయం. మెగా ఫ్యాన్స్‌, కుర్రాళ్లూ ఎగ‌బ‌డ‌తారు. కాక‌పోతే.. ‘రంగ‌స్థ‌లం’లా కుటుంబ ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఈసినిమాకి ద‌క్కుతుందా, లేదా? అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌వుతున్నాయి.

టీజ‌రు, ట్రైల‌ర్ల‌లో.. మాస్‌,యాక్ష‌న్ పాళ్లు మ‌రీ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. చ‌ర‌ణ్ చొక్కా విప్పి, గ‌న్ను ప‌ట్టి మ‌రీ భీక‌ర‌మైన పోరాట‌లు చేస్తున్నాడు. ఇవ‌న్నీ మాస్ ని మురిపించే అంశాలే. అయితే కుటుంబ ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా, అనేది అనుమానంగా మారింది. ఈ సినిమాలో యాక్ష‌న్ డోసు మ‌రీ ఎక్కువ‌గా ఉంద‌ని, ద్వితీయార్థంలో హింస‌, రక్త‌పాతం ఏరులై పారుతుంద‌న్న‌ది సెన్సార్ రిపోర్ట్‌. అదే.. కాస్త ఇబ్బంది క‌లిగించే విష‌యం. అలాంటి స‌న్నివేశాలు మాస్ మెచ్చినా.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని దూరం చేస్తుంటాయి. ‘రంగ‌స్థ‌లం’లా ‘వి.వి.రా’ కూడా రికార్డులు సృష్టించాల‌న్నా, జ‌రిగిన బిజినెస్‌కి త‌గిన వ‌సూళ్లు సాధించాల‌న్నా.. కుటుంబ ప్రేక్ష‌కుల మ‌ద్ద‌తు కావాల్సిందే. యాక్ష‌న్‌ని న‌మ్ముకున్న ఈ చిత్రం.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి ఏమాత్రం న‌చ్చుతుంద‌న్న‌ది బాక్సాఫీసు రిజ‌ల్టే తేల్చి చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఇసుక మాఫియాను గుర్తుకు తెచ్చుకోండి !

ఇసుక..ఈ మాట వింటే ఏపీ ప్రభుత్వ పెద్దల కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇసుకను తినమరిగి జీర్ణించుకోవడానికి అలవాటు పడ్డారు మరి. అధికారంలోకి వచ్చేటప్పటికి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. రాగానే ...

ఈ రోజూ ప్రచారానికి జగన్ బ్రేక్ – నిస్పృహ !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహల్లోకి చేరిపోయారు. ఆయన ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లు బయటకు రాకుండా ఉన్న ఆయనకు ఇప్పుడు నిరంతరాయంగా ప్రచారం చేయడం బద్దకంగా మారింది. ఓ...

నో వ్యాక్సిన్…ఇండియాలో వెస్ట్ నైల్ ఫీవర్ టెన్షన్..

కరోనా పీడ విరగడ అయిందని జనం రిలాక్స్ అవుతుండగా మరో కొత్త జ్వరం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో వెలుగుచూసిన ఈ కొత్తరకం జ్వరం అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్...

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close