జగన్ టీవీ 9 ఇంటర్యూ: కేసీఆర్ హీరో సరే జగన్.. నీకెందుకు ఓటెయ్యాలి..?

పాదయాత్ర ముగింపు సందర్భంగా… జగన్మోహన్ రెడ్డి నచ్చిన టీవీ చానళ్లకు ఇంటర్యూలు ఇస్తున్నారు. తొలి సొంత చానల్ సాక్షికి.. తర్వాత టీవీ 9 రజనీకాంత్‌కు ఇంటర్యూ ఇచ్చారు. సొంత చానల్ కాబట్టి.. చాలా రిజర్వేషన్లు ఉండొచ్చు కానీ… రజనీకాంత్‌కి అలాంటి రిజర్వే,షన్లు ఉండవు కాబట్టి.. అడగాల్సిన ప్రశ్నలు సూటిగానే అడిగా. వాటికి.. జగన్ చాంతాంత సమాధానాలు చెప్పినా… ప్రతీ సమాధానంలోనూ.. ఆన్సర్ చంద్రబాబే అయ్యారు. రజనీకాంత్ ఎంత గుచ్చి గుచ్చి అడిగినప్పటికి.. అసలు జగన్‌కు ఎందుకు ఓటేయాలనే ప్రశ్న వచ్చినదానికల్లా.. చంద్రబాబే సమాధానం అయ్యారు. ఆయన ప్రజావ్యతిరేకత పాలన అన్నారు కానీ… తాను వచ్చి ఏం చేస్తారో చెప్పలేకపోయారు.

అన్నింటికీ సమాధానం చంద్రబాబే..!

ప్రశ్న : చంద్రబాబు ఏమీ చేయలేదంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఇస్తున్న హామీల్ని ఎలా అమలు చేస్తారు..?
జగన్: చంద్రబాబు మోసగాడు. ఆయన అందర్నీ మోసం చేశారు. ఎవర్నడిగినా అది చెబుతారు. ఆయనతో నన్ను పోల్చకూడదు.
( ఇందులో ఎక్కడైనా ఇచ్చిన హామీలను అమలు చేసే మెకానిజం ఏమైనా ఉందా..? )

ప్రశ్న : బీజేపీని ఎందుకు విమర్శించడం లేదు..?
జగన్ : రికార్డులు తిరగేసుకోండి. మొదట నేనే బీజేపీని విమర్శించాను. చంద్రబాబే నాలుగేళ్లు కాపురం చేసి.. బీజేపీని సమర్థించారు.
( బీజేపీని నిలదీసినట్లుగా జగన్ చేసిన రాజకీయం ఎవరికైనా కనిపించిందా..? )

ప్రశ్న : హోదా ఎలా తెస్తారు..?
జగన్ : 25 మంది ఎంపీలను పట్టుకుని వెళ్లి ఎవరికి మద్దతిస్తానని చెబితే వారికిస్తా. చంద్రబాబులాగా చేయను.
ఇవి మచ్చుకు కొన్ని ప్రశ్నలు.. సంక్షిప్త సమాధానాలు మాత్రమే.. కానీ.. ప్రతీ ప్రశ్నకు… ఏకైనా ఆన్సర్‌గా చంద్రబాబే వినిపిస్తారు.

పాపం.. చంద్రబాబును ఎప్పుడూ వ్యక్తిగతంగా అనలేదట..!

చంద్రబాబును కాల్చి చంపాలి.. బావిలో దూకి చావాలి అంటూ చేసిన వ్యక్తిగత విమర్శలను.. జగన్ మర్చిపోయారు. అసలు విమర్శించనే లేదని.. చంద్రబాబును వ్యక్తిగతంగా ఎప్పుడూ అనలేదని చెప్పుకొచ్చారు. అందే కాదు.. చంద్రబాబు తనను.. ” ఆ నా కొడుకు.. ఈ నా కొడుకు..” అని తిట్టిచ్చారని కూడా రివర్స్ ఆరోపణ చేశారు. గత ఎన్నికల్లో గెలుస్తారని.. అనుకుంటే చంద్రబాబు గెలిచారు.. ఇప్పుడు కూడా ఆయనే గెలవరని ఎందుకనుకుంటున్నారంటే.. గెలుస్తారేమో అన్న పద్దతిలో జగన్ సమాధానాలిచ్చారు. ఎన్నికలు వస్తున్నాయనే హడావుడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సినిమాలు చూపిస్తున్నారంటూ.. సెటైర్లు వేశారు కానీ… తనకు ఎందుకు ఓటేయాలో మాత్రం…చెప్పులేకపోయారు.

కేసీఆర్ హీరో అందుకే నచ్చారట..!

కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు తానే స్వయంగా ఫోన్ చేసి అభినందించానని.. ఆయనది హీరో క్యారెక్టర్ కాబట్టి… చంద్రబాబును ఓడించారు కాబట్టి ఫోన్ చేసి అభినందించానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మద్దతు తీసుకుంటారా.. అన్నదానిపై డొంక తిరుగుడు సమాధానాలు చెప్పారు కానీ.. ప్రత్యేకహోదా విషయంలో కేసీఆర్‌తో కలసి పని చేస్తారట. ప్రత్యేకహోదాకు టీఆర్ఎస్ నేతలు మద్దతుగా చేసిన ప్రకటనలు సంతృప్తి నిచ్చాయట. అదే టీఆర్ఎస్.. ప్రత్యేకహోదాకు పార్లమెంట్ లో అడ్డుకుని… ఎన్నికల ప్రచారంలో.. సెంటిమెంట్ రేపినప్పుడు.. జగన్ ఎందుకు మాట్లాడలేదో మాత్రం గుర్తుంచుకుని చెప్పలేకపోయారు. నేరుగా ఎప్పుడూ కేసీఆర్ ను కలవలేదని చెప్పుకున్నారు కానీ.. రెండు, మూడు సార్లు గవర్నర్ ఇచ్చిన విందులో .. కేసీఆర్ ను కలిశారు. ఆ వీడియోలు. ఫోటోలు.. ఆన్‌లైన్‌లో ఉన్నాయి.

పొత్తులపై తనకు అనుకూలంగా ఉన్న లెక్కలే నమ్ముతున్న జగన్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పొత్తులు పెట్టుకోవడం తప్పని తేల్చేశారు. తాను పొత్తులకు వ్యతిరేకంగా కాబట్టి.. ఇతర పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్పేనట. జెండా మోసిన వాళ్లకు అన్యాయం చేయకూడదట. మరి ఇదే జగన్.. ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్న నేతలకు టిక్కెట్లు ఇస్తు… కన్నీళ్లు పెట్టుకున్న మాజీ సమన్వయకర్తలకు ఏం సమాధానం ఇస్తారు..? పైగా పవన్ విడిగా పోటీ చేస్తే.. టీడీపీ ఓట్లే పోతాయి కానీ.. తనవి పోవట. తన ఓట్లన్నీ తనకి వస్తాయట. అలా వస్తే నంద్యాలలో అంత తేడాతో ఎందుకు ఓడిపోయారో.. అంచనా వేసుకోలేకపోయారు..

అవినీతికి జీవోలు ఆధారాలట..! మరి చంద్రబాబును జైల్లో పెట్టేస్తారా..?

నాలుగేళ్లలో చంద్రబాబు ఆరు లక్షల కోట్ల అవినీతి చేశారంటూ.. ఓ పుస్తకాన్ని అచ్చేశారు జగన్. రాష్ట్ర బడ్జెట్ అంత ఉండదు. అయినప్పటికీ.. అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ ఆధారాలు జీవోలట. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబును జైల్లో పెడతారా అంటే… విచారణలో ఆధారాలు దొరికితే.. కోర్టుకు పంపుతామంటున్నారు. మరి పుస్తకంలో ఏ ఆధారాలు అచ్చేశారో.. !

కొసమెరుపు ఏమిటంటే… పాదయాత్ర చేసిన వాళ్లందరూ సీఎం అయ్యారు..మీరు అవుతారా.. అని రజనీకాంత్ ఫినిషింగ్ క్వశ్న్ అడిగి… సిగ్గుపడిపోయిన జగన్.. ” దేవుడి దయ..” అనేశారు. అంటే… నమ్మకం.. కాన్ఫిడెన్స్ లేవన్నమాట..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close