‘ఎన్టీఆర్‌’పై ఆ ఎఫెక్ట్ లేన‌ట్టేనా..?

‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ మ‌రి కొద్ది గంట‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే బుక్ మై షో ల ద్వారా అడ్వాన్సు బుకింగులు జోరందుకున్నాయి. బుధ‌వారం వీక్ డే. అయినా స‌రే… బుకింగులు అదిరిపోయాయి. దాదాపు 80 శాతం ఫుల్స్ క‌నిపిస్తున్నాయి. ఫ‌స్ట్ షో, సెకండ్ షోలు ఇప్ప‌టికే ఫుల్స్ అవుతున్నాయి. ఉద‌యం 7 గంట‌ల ఆట‌కు కొన్ని చోట్ల బుకింగులు తెరిచారు. ఆ టికెట్లుకూడా జోరుగా తెగాయి.కాక‌పోతే… మ‌ళ్లీ ఆ షో క్యాన్సిల్ అయ్యింది. తెలంగాణలో తొలి షో ప‌డేది 8.45 నిమిషాల‌కే.

ఇటీవ‌లే తెలంగాణ‌లో ఎన్నిక‌లు ముగిశాయి. ఇక్క‌డ టీడీపీ పార్టీ డిపాజిట్లు గ‌ల్లంత‌య్యాయి. మ‌హా కూట‌మిలో భాగ‌స్వామి అయిన టీడీపీకి ఎక్క‌డా ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. అత్యంత కీల‌క‌మైన కూక‌ట్ ప‌ల్లిలోనూ ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల ఎఫెక్ట్ బ‌యోపిక్‌పై ఉంటుందేమో అని చిత్ర‌బృందం కాస్త అనుమానించింది. ఈ సినిమాపై `టీడీపీ` ముద్ర బ‌లంగా ఉండ‌డంతో… నంద‌మూరి అభిమానులు కూడా ఈ విష‌యంలో కాస్త భ‌య‌ప‌డ్డారు. కానీ.. బుకింగ్స్ జోరుగా ఉండ‌డం, హైద‌రాబాద్ లోని అన్ని మ‌ల్టీప్లెక్స్‌లూ దాదాపు ఫుల్స్ అవుతుండ‌డంతో.. చిత్ర‌బృందం సంతోషంగా ఉంది. మ‌హేష్ బాబు మ‌ల్టీప్లెక్స్‌లో ఎన్టీఆర్ టికెట్ల‌న్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇవ‌న్నీ ఎన్టీఆర్‌కి శుభ‌సూచికాలే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close