మ‌హ‌ర్షి.. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ అదిరింది

మ‌హేష్ బాబు – వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌హ‌ర్షి. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో మ‌హేష్ ఓ బిలియ‌నీర్‌గా క‌నిపించ‌నున్నాడు. స్నేహం, మాన‌వ‌త్వం, మ‌నిషిత‌త్వం గురించి చెప్పే క‌థ ఇది. ఓ విలాస పురుషుడు… మ‌హ‌ర్షిగా ఎలా మారాడు అన్న‌దే కాన్సెప్ట్‌. ప్ర‌థ‌మార్థం వినోదాత్మ‌కంగా సాగితే.. ద్వితీయార్థం కాస్త సీరియ‌స్ ఎమోష‌న్స్‌తో న‌డ‌వ‌బోతోంది. అయితే ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ఈసినిమాకి అత్యంత కీల‌కం. అక్క‌డే రిషిలో మార్పు వ‌స్తుంద‌ట‌. త‌న బాధ్య‌తేంటో తెలుసుకుని గ‌మ్యం వైపుగా అడుగులు వేస్తాడ‌ట‌. అక్క‌డి నుంచి క‌థ మ‌రో మ‌లుపు తీసుకుంటుంద‌ని తెలుస్తోంది.

మ‌హేష్ అప‌ర కుబేరుడు. త‌న క‌ష్టం, శ్ర‌మ‌నే త‌న‌ని ఈ స్థాయికి తీసుకొచ్చాయ‌ని న‌మ్ముతాడు. కానీ.. త‌న ఎదుగుద‌ల వెనుక మ‌రో బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని, త‌న ఉన్న‌తికి తోడ్ప‌డిన ఓ స్నేహితుడు ప్ర‌స్తుతం.. క‌ష్టాల క‌డ‌లిలో ఈదుతున్నాడ‌న్న విష‌యం తెలుస్తుంది. ఆ స్నేహితుడి కోసం మ‌హేష్ ప‌ల్లెబాట ప‌డ‌తాడు. మ‌హేష్‌లో మార్పు రావ‌డానికి ఓ బ‌ల‌మైన సంఘ‌ట‌న కార‌ణం అవుతుంది. అదే.. మ‌హ‌ర్షి ఇంట్రవెల్ బ్యాంగ్. మ‌హేష్ స్నేహితుడిగా న‌రేష్ న‌టిస్తున్న సంగతి తెలిసిందే. న‌రేష్ పాత్ర‌.. ద్వితీయార్థంలో కీల‌కంగా మార‌బోతోంద‌ట‌. మొత్తానికి ఓ శ్రీ‌మంతుడు.. స్నేహం కోసం ఎంత‌టి త్యాగం చేశాడో చెప్ప‌డ‌మే మ‌హ‌ర్షి క‌థ ఉద్దేశం. ఈ భావోద్వేగాలు తెర‌పై ఎంత పండితే.. ఈ సినిమా అంత‌గా ప్రేక్ష‌కుల‌కు చేరువ అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close