అభిమానుల‌కు అఖిల్ విన్న‌పం

టాలీవుడ్‌లో హీరోలే దేవుళ్లు. ఓ క‌థానాయ‌కుడ్ని అభిమానించారంటే.. . అభిమానులు నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. వాళ్ల అభిమానాన్ని ర‌క‌ర‌కాల రూపాల్లో చూపిస్తారు. అఖిల్ కోసం ముగ్గురు అభిమానులు కూడా అదే చేశారు. విజ‌య‌వాడ నుంచి తిరుప‌తి వ‌ర‌కూ కాలి న‌డ‌కన వెళ్లారు. ఈ విష‌యం అఖిల్ కీ తెలిసింది. అందుకే `మిస్ట‌ర్ మ‌జ్ను` ప్రీ రిలీజ్ వేడుక‌లో… త‌న అభిమానుల‌కు ఓ సందేశం అందించాదు.

”ఈమ‌ధ్య ఓ విష‌యం తెలుసుకున్నాను. రెడ్డి అనే ఓ అభిమాని మ‌రో ఇద్దరితో క‌లిసి విజ‌య‌వాడ నుంచి తిరుప‌తి 450 కిలో మీట‌ర్లు కాలిన‌డ‌క‌న వెళ్లార‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న వెంట‌నే నా కంట్లోంచి నీళ్లొచ్చాయి. ఇదంతా అవ‌స‌రం లేదు. మీ అభిమానం మాతో ఉంది. అది చాలు. ఇలాంటి సాహ‌సాలు చేయ‌కండి. మీ కుటుంబ స‌భ్యులు మీపై చాలా ఆశ‌లు పెట్టుకుంటారు. వాళ్లంతా బాధ‌ప‌డుతుంటారు. ఇంకెప్పుడూ ఇలాంటి సాహ‌సాలు చేయ‌కండి” అని అభిమానుల్ని కోరాడు అఖిల్‌.

ఇదే వేదిక‌పై ఎన్టీఆర్‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు. త‌న‌ని ప్రేమ‌గా టైట‌ర్ అని పిలుస్తాన‌ని, త‌న ఎన‌ర్జీని ఎవ్వ‌రూ మ్యాచ్ చేయ‌లేర‌ని కితాబు ఇచ్చాడు. ”తార‌క్ గారూ… అంటే త‌ట్టుకోలేడు. ఏట్రా బ‌లిసిందా.. ఫార్మ‌ల్‌గా అయిపోతున్నావు అని అడుగుతాడు. క‌లిసిన నిమిషంలో కుటుంబ స‌భ్యుడిలా చూసేసుకుంటాడు. ట్విట్ట‌ర్‌లో థ్యాంక్స్ అని పెడితే.. అలా పెట్ట‌కు, అది నా బాధ్య‌త అన్నాడు” అంటూ ఎన్టీఆర్ పై ప్రేమ కురిపించాడు అఖిల్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close