సుభాష్ : పొలిటికల్ “బద్రి” – పొత్తుల్లో క్లైమాక్స్ ఏమిటి..?

బద్రి సినిమా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి ఫేవరేట్. అందుకే క్లైమాక్స్ సీన్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది…!. రాజకీయాల్లోనూ ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నారు. ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. పొత్తులు పెట్టుకోవాలా..? ఒంటరిగా పోటీ చేయాలా..? అనే రెండు అంశాల మధ్య నలిగిపోతున్నారు. ఏదో ఒకటి డేరింగ్ .. అండ్ డాషింగ్‌గా నిర్ణయం తీసుకోవడానికి ఇదేమి సినిమా క్లైమాక్స్ కాదు.. పొలిటికల్ బిగినింగ్. తేడా వస్తే క్లైమాక్స్ లేకుండా పోతుంది. అందుకే పవన్ కల్యాణ్.. ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. ఎంతగా..అంటే.. సీట్ల సర్దుబాటు గురించి మాట్లాడేశారని… టీజీ వెంకటేష్‌ని సైతం చెడామడా తిట్టేశారు. ఇంతకూ పవన్ కల్యాణ్‌కు పొత్తుల్లో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎందుకొచ్చింది.

పొత్తుల ఒత్తిడితో ఫ్రస్ట్రేషన్‌లో పవన్..!

జనసేన అధినేతకు.. రాజకీయం పై అవగాహన ఉంది. ప్రజారాజ్యం పార్టీ ప్రయోగం, విఫలంపై.. కాస్తంత స్టడీ కూడా చేశారు. తన పార్టీ అలా కాకూడదని గట్టి నమ్మకంతో ఉన్నారు. దాని కోసం ఏం చేయాలన్నదానిపై మేథోమథనం కూడా చేశారు. కానీ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా .. తను సొంత నిర్ణయాలు తీసుకోలేరు. సహజంగా అయితే తీసుకోవచ్చు.. కానీ ..రాజకీయ పార్టీ అన్న తర్వాత అనేక పరోక్ష అంశాలు నిర్ణయాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందులో మొదటిది.. ఫండింగ్. రాజకీయ పార్టీని నడపడం అంటే.. అంత సులువు కాదు. ఓ మాదిరి బహిరంగసభ పెట్టాలన్నా .. బడ్జెట్.. కోటి దాటి పోతుంది. ప్రధాన పార్టీల్లో అయితే అభ్యర్థిత్వాన్ని ఆశించే వాళ్లు.. ముగ్గురు నలుగురు ఉంటారు.. వారికి పార్టీ కొంత వేసి.. నడిపించేస్తుంది. ఇక అధికార పార్టీకి అయితే వెదుక్కోవాల్సిన పని ఉండదు. ఇదంతా పార్టీ కార్యక్రమాలు ఖర్చు. ఇక ఎన్నికల్లో పోటీ చేయాలంటే… ఆ ఖర్చు అంచనా వేయలేం. ఇప్పటికే వస్తున్న అంచనాల ప్రకారం.. ఒక్కో ప్రధాన పార్టీ అభ్యర్థి నియోజకవర్గానికి మినిమం రూ. 10కోట్లు ఖర్చు పెడతారన్న ప్రచారం ఉంది. ఇదంతా.. ఆయా అభ్యర్థుల ఖర్చు. ప్రజాబలం ఉంటే.. పార్టీ డబ్బులిచ్చి మరీ నిలబెడుతుంది. ఇప్పుడు జనసేన అధినేతకు ఇదే టెన్షన్. ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే… కనీసం రూ. 2వేల కోట్లు ఉండాలనేది.. ఆయన వేసుకున్న అంచనా. కొద్ది రోజుల కిందట.. ఓ జిల్లా కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఇదే లెక్క చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే.. రూ. 2వేల కోట్లు కావాలంటున్నారని.. కానీ తన దగ్గర డబ్బుల్లేవని.. డబ్బులేని రాజకీయాలు చేస్తానని చెప్పుకొచ్చారు.

నిధులిచ్చేవాళ్లు పొత్తులు పెట్టుకోమంటున్నారు..!

పవన్ కల్యాణ్ చెప్పినట్లు డబ్బులు అవసరం.. డబ్బు లేకుండా రాజకీయం నడవదు.. డబ్బులేని రాజకీయాలు చేస్తానని ఆయన మాట వరుసకు చెప్పాడు కానీ.. సాధ్యం కాదని తెలుసు. అందుకే… పార్టీకి ఫండింగ్ కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు లేవు. అమెరికా పర్యటన దగ్గర్నుంచి కవాతు యాత్రల్లో చేసే వ్యూహాత్మక విమర్శల వరకూ… ఎన్నికల్లో ఫండింగ్ కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రయత్నాలు ఫలించాయి కూడా. అయితే.. ఫండింగ్‌కు వచ్చినవాళ్లు… ఒకటే చెబుతున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేదే ఆ షరతు. జనసేన బలం.. ఎలా చూసినా… పది శాతం ఓట్లలోపే ఉంటుంది కాబట్టి.. అది తను గెలుస్తూ.. ఇతరుల గెలుపు కోసం ఉపయోగపడేలా చేసుకోవాలని… ఆ ” ఫండ్ ” మేనేజర్ల ప్రతిపాదన. ఒంటరిగా పోటీ చేస్తే… తామిచ్చిన నిధులన్నీ.. డిపాజిట్లు దక్కించుకోవడానికే పనికొస్తాయని.. ఆ విధంగా చేస్తే.. తమ దాతృత్వం అంతా బడిదలో పోసిన పన్నీరే అవుతుందని చెబుతున్నారంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్… ఎంత గా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా వారు వినలేదని… అంటున్నారు.

ఒంటరిగా పోటీ చేయాల్సిందేనంటున్న మరో వర్గం..!

పవన్ కల్యాణ్‌కు ఇది ఒక్కటే ఒత్తిడి అయితే అయన పొత్తులకు రూట్ క్లియర్ చేసుకునేవారేమో..? కానీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. పొత్తులు వద్దే వద్దు.. ఒంటరిగా బలం చాటాలనే… బలమైన వర్గం కూడా… ఆయన పక్కనే ఉంది. పీఆర్పీ నుంచి పవన్ తో సన్నిహితంగా వ్యవహరిస్తూ.. సామాజికవర్గం కోణంలో… వారంతా పవన్ కల్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నారు. అటు కాంగ్రెస్ తో కలిసినా.. ఇటు జగన్ తో కలిసినా.. జనసేన మరో పీఆర్పీలా అవుతుందని.. వారి వాదన. అందుకే ఎంత కష్టమైన ఒంటరిగా పోటీ చేద్దామని.. కనీసం ఇరవై స్థానాలు గెలిచినా.. కింగ్ మేకర్ కావొచ్చని.. వారు పవన్ కు నూరిపోస్తున్నారు.

సిట్యుయేషన్ డిమాండ్ చేస్తున్నా ఏమీ చేయలేకపోతున్నారా..?

సిట్యుయేషన్ చూస్తే… ఓ వైపు పొత్తులు పెట్టుకోమని.. ఎంతగా ఒత్తిడి వస్తుందో.. వద్దు.. ఒంటరిగా పోదామనే… ఒత్తిడి అంత కంటే ఎక్కువగా ఉంది. ఈ రెండింటి మధ్య పవన్ కల్యాణ్ నలిగిపోతున్నారు. అచ్చంగా బద్రి సినిమా క్లైమాక్స్‌లోలా..? ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి..? ఏ నిర్ణయం తీసుకుంటే.. ఎలాంటి పరిణామాలు వస్తాయో.. ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక.. పవన్ కల్యాణ్ కూడా ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. సినిమాల్లో అయితే ప్రేక్షకుల ఊహకు వదిలిసి ముగించేయవచ్చు. కానీ రాజకీయంలో అలా ఓటర్లకు వదిలేయడానికి లేదు ..! పవన్ ఏదో ఒకటి తేల్చుకోవాలి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close