కోట్లు సంపాదించినా కక్కుర్తేనా… !

ముఖం అందంగా ఉంటే చాలా? మనసు కూడా అందంగా, నిర్మలంగా ఉండొద్దా? ఇప్పుడు దేశంలో చాలా మంది హేమమాలినిని అడుగుతున్న ప్రశ్న ఇది. డ్రీమ్ గర్ల్ గా పేరు పొందిన ఈ సినీ నటి, ఇప్పుడు ప్రజా సేవలో తరిస్తోంది. మథుర నుంచి బీజేపీ టికెట్ మీద ఎంపీగా ఎన్నికైంది. ముంబైలో డాన్స్ అకాడమీ కోసం 40 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని 70 వేలకే కొట్టేసిన హేమను ఇప్పుడు చాలా మంది విమర్శిస్తున్నారు.

మార్కెట్ విలువ ప్రకారం కనీసం 40 కోట్ల ఖరీదు చేసే స్థలాన్ని అప్పనంగా 70 వేలకు సొంతం చేసుకోవడం ఎంత పెద్ద కుంభకోణం? మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అంటే స్కాముల పుట అని ఆడిపోసుకున్న బీజేపీ వాళ్లు ఇప్పుడు ఏం జవాబు చెప్తారు? మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం హేమమాలిని పట్ల ఇంత ఔదార్యాన్ని ఎందుకు ప్రదర్శించింది? ఆమె బీజేపీ ఎంపీ కాబట్టే కదా? మరి కాంగ్రెస్ కు, బీజేపీకి తేడా ఏమిటి? రాబర్ట్ వాద్రాపై ఆరోపణలు చేసే నైతిక హక్కు బీజేపీకి ఉందా?

హేమమాలిని ఓ పేద కళాకారిణి కాదు. ఆమె, భర్త సినీ తారలే. రెండు చేతులా సంపాదించారు. కోట్లు గడించారు. అందులో ఒక్క పైసా అయినా పేదల కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. సినిమా పాపులారీటితో రాజకీయాల్లో టికెట్ సాధించారు. ఎంపీ అయ్యారు. గత ఏడాది ఆమె స్వయంగా దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లోని వివరాల ప్రకారం, ఆమె ఆస్తుల విలువ దాదాపు 200 కోట్ల రూపాయలకు దగ్గర్లో ఉంటుంది. కచ్చితంగా చెప్పాలంటే, ఆమెకు 162 కోట్ల రూపాయలకు పైగా విలువైన స్థిరాస్తులున్నాయి. 13.6 కోట్ల రూపాయల చరాస్తున్నాయి. కాబట్టి, అకాడమీ పెట్టాలనుకుంటే స్థలం కొనుక్కుంటారు. అయినా అకాడమీలో ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తారా? వేలకు వేలు ఫీజు వసూలు చేస్తారు. ఇప్పుడు దేశంలో అనేక చోట్ల డాన్స్, క్రీడా అకాడమీలకు సర్కార్ నుంచి ఉచితంగా, తక్కువ ధరకు స్థలాలు తీసుకున్న వారు ఫక్తు వ్యాపారం చేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.

పేదవాడు తల దాచుకోవడానికి రోడ్డుపక్కన గుడిసె వేసుకుంటే పీకి పారేస్తారు. కోట్లున్న వారికి మాత్రం సర్కారీ స్థలాలను దోచిపెడతారు. ఒకరకంగా హేమమాలిని చేసింది కబ్జా అని ఆన్ లైన్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ పై చాలా మంది నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది ఏమిటి? జరుగుతున్నది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. హేమమాలిని డాన్స్ అకాడమీ పెట్టి కొత్త వ్యాపారం చేయకపోతే దేశానికి వచ్చే నష్టమేమీ లేదు. ముంబైలో కొన్ని లక్షల మంది నీడలేక ఫుట్ పాత్ లపై నిద్రపోతారు. వారు తలదాచుకోవడానికి నైట్ షెల్టర్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు లేదు? ఫడ్నవీస్ జవాబు చెప్పగలరా !?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఇసుక మాఫియాను గుర్తుకు తెచ్చుకోండి !

ఇసుక..ఈ మాట వింటే ఏపీ ప్రభుత్వ పెద్దల కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇసుకను తినమరిగి జీర్ణించుకోవడానికి అలవాటు పడ్డారు మరి. అధికారంలోకి వచ్చేటప్పటికి ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. రాగానే ...

ఈ రోజూ ప్రచారానికి జగన్ బ్రేక్ – నిస్పృహ !

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాశ నిస్పృహల్లోకి చేరిపోయారు. ఆయన ప్రచారానికి ఆసక్తి చూపించడం లేదు. ఐదేళ్లు బయటకు రాకుండా ఉన్న ఆయనకు ఇప్పుడు నిరంతరాయంగా ప్రచారం చేయడం బద్దకంగా మారింది. ఓ...

నో వ్యాక్సిన్…ఇండియాలో వెస్ట్ నైల్ ఫీవర్ టెన్షన్..

కరోనా పీడ విరగడ అయిందని జనం రిలాక్స్ అవుతుండగా మరో కొత్త జ్వరం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కేరళలో వెలుగుచూసిన ఈ కొత్తరకం జ్వరం అక్కడి ప్రజలను వణికిస్తోంది. దీనికి వ్యాక్సిన్...

కూటమికి సంఘీభావం తెలుపుతూ జర్మనీలో ప్రవాసాంధ్రుల ర్యాలీ

మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఆదివారం, మే 5 తారీఖునాడు ఫ్రాంక్ఫుర్ట్ నగరంలో ప్రవాసాంధ్రులు ర్యాలీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close