సుభాష్ : ట్రైలరే ఇలా ఉంటే.. ఇక సినిమా ఎలా ఉంటుంది మోడీ సార్..!?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ .. ఈ మధ్య పూర్తిగా సినిమా మూడ్‌లోకి వెళ్లిపోయారు. బాలీవుడ్ స్టార్స్.. ఇంకా చెప్పాలంటే.. స్టార్స్ కాని వాళ్లు కూడా.. బాలీవుడ్ అనే ట్యాగ్ లైన్ ఉంటే.. పీఎంవోకి సులువుగా వెళ్లిపోతున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీరికి మోడీ.. గొప్ప గౌరవమర్యాదలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో గుడ్మార్నింగ్ టైప్ మెసెజులు కూడా పెడుతున్నారు. చిన్న చిన్న నటుల్ని కూడా.. సోషల్ మీడియాలో పలకరించి గిలిగింతలు పెడుతున్నారు. ఈ పెద్దాయకు సినిమా పిచ్చేమిటని.. నాలాంటి వాళ్లు అనుకున్నా.. అదంతా ఎలక్షన్ స్టంట్స్‌లో భాగమనుకున్నాం కానీ.. బడ్జెట్ చేసిన తర్వాత.. బడ్జెట్ చూసిన తర్వాత మీ మాటలు విన్న తర్వాత .. నిజంగానే సినిమా చూపించబోతున్నారని అర్థమైపోయింది. స్వయంగా మీరు కూడా.. ఇది ట్రైలరే.. అసలు సినిమా ఎన్నికలయిపోగానే ఉంటుందని చెప్పారు. ఇక మేమంతా.. అంటే మీ “మిత్రోం..” ఏం చేయగలం..?

అప్పట్లో “ఈవిల్ డెడ్” .. ఇప్పట్లో “నోట్ల రద్దు..”!

డబ్బుల్లేక.. ఆకలితో ఉన్న రోజులు ఉన్నాయి కానీ.. డబ్బులు ఉండి ఆకలితో అలమటించాల్సిన దుస్థితి ఒకటి ఉంటుందని.. నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ మీరు నాకు అది రుచి చూపించారు. సంపాదన లేనప్పుడు… కడుపు నింపుకోవడానికి.. డబ్బులు ఎలా.. ఎవరి దగ్గర అప్పు చేయాలా అన్నదే అప్పట్లో మిషన్. అదేదో పొందిన తర్వాత ఎక్కడికి వెళ్లినా కడుపు నిండేది. కానీ.. సంపాదన ప్రారంభమైన తర్వాత కూడా… ఆకలితో అలమటించాల్సి వస్తుందని… మీ నోట్ల రద్దు సినిమా ద్వారానే తెలిసింది. చేతిలో వెయ్యి నోట్లున్నాయి.. ఐదు వందల నోట్లున్నాయి.. బ్యాంకు అకౌంట్‌లో … డబ్బులున్నాయి. చేతిలో ఏటీఎం కార్డులున్నాయి. అంతిమంగా చెక్‌లు కూడా ఉన్నాయి. కానీ.. చేతిలో ఉన్న డబ్బులు చెల్లలేదు.. బ్యాంకులో ఇవ్వలేదు.. ఏటీఎంలలో రాలేదు. ఓ ఏటీఎం క్యూలో.. నాలుగు గంటలు నిలబడి… కరెక్ట్‌గా నా వంతు వచ్చే సరికి… ” నో క్యాష్” అనే మెసెజ్‌ను ఏటీఎం చూపించిన తర్వాత జ్ఞానోదయంతో కూడిన మహాగ్రహం వచ్చింది. వెంటనే స్వామి సుఖబోధానంద ఆశ్రమంలో చేరిపోవాలన్నంత కోపం వచ్చింది. తానీ షాడో నవలల్లో .. షాడో తొక్కిపెట్టినట్లు.. నా ఆగ్రహాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ అవన్నీ.. నాకు ఓ హార్రర్ సినిమాలా.. ఇప్పటికీ అప్పుడప్పుడు కలల్లోకి వస్తూంటాయి. కొత్త నోట్లు.. పాత నోట్లు కార్డులు.. అని కలరిస్తూ ఉంటారు. అప్పుడెప్పుడో… … చిన్నప్పుడు వీసీఆర్‌లో చూసిన “ఈవిల్ డెడ్” సినిమా చూసిన తర్వాత ఎంతగా భయపడి.. కలవరించి.. ఉలిక్కిపడి లేచేవాడిని. ఆ తర్వతా అలాంటి హర్రర్ సినిమా మీ “నోట్ల రద్దు” ద్వారానే చూడగలిగా సార్..!

ఇంతకీ “జీఎస్టీ” ఏ టైప్ సినిమా సార్..!

కొన్నాళ్ల క్రితం.. తేదీ సరిగ్గా గుర్తు లేదు… అలా మా ఊరెళదామని.. బయలుదేరా. ఉదయం.. బస్టాండ్‌లో దిగా. మా వూరెళ్లాలంటే.. ఇంకో బస్ మారాలి. ఈ లోపే మొహం కడుక్కుని.. టిఫిన్ చేద్దామని అనుకున్నా..!. ఎప్పుడూ బ్రష్, పేస్ట్.. తోనే కదా కడుక్కునేది…ఈ సారి సంప్రదాయబద్దంగా ఆర్గానిక్ పద్దతితో ట్రై చేద్దామని.. వేపపుల్లలు అమ్ముతున్న వాడి దగ్గరకు వెళ్లి… ఓ పుల్ల కొనుక్కున్నా. వాడు ఒక్క పుల్ల రూ. ఆరు అన్నాడు. అదేమి లెక్కో అర్థం కాలేదు.. స్పెసిఫిక్‌గా ఆరు రూపాయలే ఎందుకు చెబుతున్నావని అడిగితే … ” మామూలుగా అయితే…ఐదే.. కానీ ఈ రోజు నుంచి జీఎస్టీ.. అందుకే ఆరు..” అన్నాడు. ఆ మాట విని మార్చవచ్చినా.. తట్టుకున్నా.. అప్పట్నుంచి జీఎస్టీ సినిమా నాకు.. కామెడినా.. సీరియస్సా.. క్రైమా.. ధ్రిల్లరా అర్థం కావడం లేదు. జీఎస్టీతో నాకు ఎదురైన సందర్భాల్ని బట్టి… ఆయా కేటగిరీల్లో నాకు మీరు జీఎస్టీ సినిమా చూపిస్తున్నారని.. సంతోష పడుతున్నా..!

మీ బాక్సాఫీస్ ఫుల్లు.. నా పర్సు నిల్లు..! మోడీ సినిమా సూపర్ హిట్..!

2014లో పెట్రోల్ ధర రూ.60 అయిందని… కాంగ్రెస్ దేశ ప్రజల్ని దోచుకుంటోందని గుజరాత్‌లో మీరు అంటే.. కసిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేశా..!. ఆదాయపు పన్ను శ్లాబుల్ని పెంచకుండా.. ఉద్యోగుల్ని కాంగ్రెస్ వేధిస్తోందని మీరంటే.. నాకొచ్చే అరకొర జీతానికి టీడీఎస్ పేరుతో రూ. 2వందలు కట్ చేశారని..అది నిజమేనని నమ్మి కసిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేశా..!. కాంగ్రెస్ వాళ్లు స్కాములు చేశారని.. దానికి సాక్ష్యాలున్నాయని … వచ్చాక ఎవర్నీ వదలబోమని చెబితే.. నమ్మేసి.. మోడీ జయహో అన్నా..! … కానీ ఏం జరిగింది..? సినిమాలు చూపించారు. అన్ని మసాలాలతో కూడిన సినిమాలు చూపించారు. ఈ సినిమాలు ఇప్పుడు కలల్లో కూడా వస్తున్నాయి.

మళ్లీ వస్తే అసలు సినిమా చూపించేస్తారా..?

బడ్జెట్ అయిపోగానే.. దూరదర్శన్‌లో మీ నుంచి ఓ డైలాగ్ వచ్చిందని అందరూ చెబుతున్నారు.. బడ్జెట్ అసలు ట్రైలరే.. మళ్లీ అధికారం చేపట్టగానే.. అసలు సినిమా చూపిస్తానని అన్నారట. అప్పట్లో ఈవిల్ డెడ్ సినిమాలు చూసిన చైల్డ్ నే కానీ.. ఇటీవలి కాలంలో… “ది కంజ్యూరింగ్” అనే లెజెండ్‌ని అయ్యా. మీరు ఎలాంటి సినిమాలు విడుదల చేసినా నేను భయపడను…ఎందుకంటే.. నా జాగ్రత్తలో నేనుంటా..! అన్ని రకాల నోట్లు… జాగ్రత్త చేసుకుంటా..! క్రెడిట్, డెబిట్ కార్డులు తీసుకుంటున్నా..! ఎన్ని రకాల వాలెట్లు ఉంటే.. అన్నింటినీ యాక్టివేట్ చేసుకుంటా..!. అన్నింటినీ రద్దు చేసినా సరే.. భయపడను. ఎందుకంటే.. నేను ” దికంజ్యూరింగ్” చూసినా భయపడలేదు. ..!

మీ సినిమాలు మేము ఆహ్వానిస్తాం.. మోడీ సార్..! వియ్ వెల్కం యువర్ మూవీస్…! ఆహ్వానించక చస్తామా..? ఆహ్వానించకపోతే చస్తాము..! మాకు తెలుసు కదా..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : సీఎం రమేష్‌తో డిబేట్‌లో ఓడిపోయిన టీవీ 9

టీవీ చానల్ చేతుల్లో ఉంది. అంతకు మించి సీక్రెట్ బాసులను మెప్పించేందుకు తెరపై చేసే విన్యాసాలకు లెక్కలేనన్ని ఐడియాలు ఉన్నాయి. ఇంత వరకూ అదే చేశారు. కానీ అంతా సీఎం...

ముద్రగడ పేరు మార్చుకుంటారా..?పోస్ట్ వైరల్..!!

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని సవాల్ చేసిన ముద్రగడ ఇక పేరు మార్చుకునేందుకు రెడీ అవ్వాలంటూ జన సైనికులు రూపొందించిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది....

వైసీపీ సోషల్ మీడియా దుకాణ్ బంద్ !

పోలింగ్ సరళితోనే వైసీపీ దుకాణ్ బంద్ చేసింది. పోలింగ్ ముగిసిన తరవాత రోజే ఐ ప్యాక్ సిబ్బందిని మెడపట్టి బయటకు గెంటేశారు. రిషిరాజ్ సింగ్ నేతృతవంలో ఉన్న ఐ ప్యాక్ సేవలు ఇక...

విషాదం… పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం..

ఎన్నికల్లో ఓటేసి ఉత్సాహంతో సొంతూరు నుంచి బయల్దేరిన వారిని ఊహించని ప్రమాదం వెంటాడింది. ఎంచక్కా కబుర్లతో కొద్ది గంటల్లోనే గమ్యస్థానాలకు చేరుకుంటామని ఆనందోత్సాహాలతో గడుపుతోన్న వారిని మృత్యువు పలకరించింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close