రూ 1993 కోట్లతో “స్మార్ట్”కాకినాడ!

యూజర్ చార్జీలకు ప్రజలు సిద్ధమైపోవాలి మరి!!

స్మార్ట్ సిటి కోసం ఖర్చయ్యే నిధుల్లో దాదాపు 25 శాతం మాత్రమే కేంద్రం నుంచి గ్రాంటుగా వస్తుంది. కేంద్రప్రభుత్వం నుంచి, రాష్ట్రప్రభుత్వం నుంచీ వచ్చే రెగ్యులర్ నిధులను స్మార్ట్ సిటీ ఖాతాకు మళ్ళించి, ప్రయివేట్ భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేసుకుని, యూజర్ చార్జీలు విధించుకునీ, అప్పులు చేసీ మిగిలిన నిధులను సమకూర్చుకోవాలి.ఇంతేకాకుండా పనులఅజమాయిషీకోసం ఏర్పాటయ్యే స్పెషల్ పర్పస్ వెహికల్ వ్యవస్ధ మున్సిపల్ కార్పొరేషన్ కు సమాతంతర పాలనా వ్యవస్ధ కాగల అవకాశం కూడా వుందని కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు రిపోర్టు వివరాలను బట్టి అర్ధమౌతోంది.

కాకినాడను స్మార్ట్ సిటిగా అభివృద్ధి చేయడానికి 1993 కోట్ల రూపాయలు ఖర్చయ్యే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తూర్పుగోదావరిజిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ కేంద్రకేబినెట్ సెక్రెటరీ ప్రదీప్‌కుమార్‌ సిన్హా కు ఈ విషయం వివరించారు.

స్మార్ట్ సిటీల రూపకల్పన కోసం ప్రభుత్వ నిధులుపైనే ఆధారపడకుండా స్థానికంగా యూజర్ ఛార్జీల వసూలు, పబ్లిక్‌ ప్రయివేట్‌ భాగస్వామ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కన్వర్జెన్స్‌ ద్వారా నిధుల సమీకరణకు కృషి చేయాలని ఒక వీడియో కాన్ఫరెన్సులో సిన్హా సూచించారు.

దేశ వ్యాప్తంగా మొదటి విడతగా ఎంపిక చేసిన 20 స్మార్ట్ నగరాల్లో ఆంధ్రప్రదేశ్ లోనే రెండు (విశాఖ, కాకినాడ) వున్నాయి. అందులో కాకినాడ వివరాలను కలెక్టర్ చెప్పారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు – హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌, ఆర్‌అండ్‌బి, కల్చర్‌, ఎనర్జీ, రంగాల్లో రూ.244 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.488 కోట్లు, స్మార్ట్‌ సిటీ నిధులు రూ.488 కోట్లు, రుణం రూ.140 కోట్లు, వాణిజ్యపరంగా అవకాశాలున్న ప్రయివేట్ భాగస్వామ్యంలో రూ.174 కోట్లు, కాకినాడ నగరపాలక సంస్థ సొంత నిధులు రూ.73 లక్షలు, సిఎస్‌ఆర్‌ నిధులు రూ.2.50 కోట్లు కలిపి మొత్తం రూ.1,993 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని వివరించారు.

స్మార్ట్ సిటీలో వెంటనే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పివి)ని ఏర్పాటు చేసుకుని పనులు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కేబినెట్ సెక్రెటరీ ఆదేశించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close