లింగుసామితో అల్లు అర్జున్ బైలింగ్వల్ మూవీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆలోచనలు ఎవరికి అర్ధం కావు.. సైలెంట్ గా కనిపిస్తూనే స్టార్ హీరోలకు ఎత్తులు పై ఎత్తులు వేస్తుంటాడు అల్లు అర్జున్. ప్రస్తుతం స్టార్ హీరోగా సూపర్ క్రేజ్ సంపాధించిన అల్లు అర్జున్ ఇప్పటికే తన సినిమాలను తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయించి అక్కడ కూడా ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నాడు. తను తీసేది చాలా వరకు యూత్ ఫుల్ సినిమాలే కాబట్టి బన్నికి మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది.

అయితే ప్రస్తుతం బన్ని ఈ క్రేజ్ ను ఇంకా విస్తరించాలనే ఉద్దేశంతో తెలుగు తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడట. దానికి లింగుసామితో చర్చలు జరుపుతున్నాడని తెలుస్తుంది. కోలీవుడ్ దర్శకుడు లింగుసామి అంటే మంచి మాస్ దర్శకుడనే భావన ఉంది. అయితే ఆ దర్శకుడితో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు బన్ని. ప్రస్తుతం బన్ని సరైనోడు సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా పూర్తయ్యాక విక్రం కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని అన్నారు.

ఇక లింగుసామి కూడా ఈలోపు విశాల్ తో పందెం కోడి సీక్వల్ సినిమా పూర్తిచేస్తాడట. అయితే బన్నితో లింగుసామి తీసే ఎలా ఉండబోతుందా అని ఇప్పటినుండే అభిమానులు ఊహించుకోవడం మొదలెట్టారు. ఈ ఇద్దరి కలయికతో వచ్చే సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close