రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి – నాని కాంబోలో ‘ఈగ’ వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు ‘ఈగ 2’ ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ అది ఇప్ప‌ట్లో సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. అయితే ఇప్పుడు రాజ‌మౌళి, నాని కాంబో మళ్లీ చూసే ఛాన్స్ వ‌చ్చింది. అయితే వెండి తెర‌పైకాదు. స్టేజ్ మీద‌.

మే 4 ద‌ర్శ‌కుల దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి హైద‌రాబాద్ లో ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వ‌హించ‌బోతున్నారు. 4 గంట‌ల పాటు సాగే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ షోలో.. చాలా స్కిట్లు, ఆట‌పాట‌లు చూసే అవ‌కాశం ఉంది. ఈ వేదిక‌పై నాని, రాజ‌మౌళి గ్యాంగ్ క‌లిసి ఓ స్కిట్ చేస్తోంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ స్కిట్ కి సంబంధించిన రిహార్స‌ల్స్ జ‌రుగుతున్నాయి. రాజ‌మౌళి – ర‌మ క‌లిసి ఓ పాట‌కు స్టెప్పులు వేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అనిల్ రావిపూడి, త‌మ‌న్నా క‌లిసి ఓ పాట‌కు చిందేస్తార‌ట‌. మిగిలిన ద‌ర్శ‌కులు కూడా వాళ్ల వాళ్ల ప్ర‌తిభ‌ను ఈ వేదిక‌పై ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ఈనెల 4న ఎల్.బీ స్టేడియంలో ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. బాలీవుడ్ నుంచి కూడా కొంత‌మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యే ఛాన్సుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close