షర్మిల కేసులో “కామెంట్లు” చేసిన వారే నేరస్తులా..?

వైఎస్ షర్మిల కేసులో.. తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై.. అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె చేసిన ఫిర్యాదుపై.. పోలీసులు ఇప్పటి వరకూ.. రెండు అరెస్టులు చూపించారు. ఈ రెండు అరెస్టులకు పోలీసులు చెప్పిన కారణం… కేవలం.. కామెంట్లు చేయడం. ఎవరో వీడియోలు అప్ లోడ్ చేస్తే… ఆ యూట్యూబ్ వీడియోల కింద.. ఇద్దరు యువకులు కామెంట్లు మాత్రమే చేశారు. వారిలో గుంటూరుకు చెందిన యువకుడు.. ఎంసీఏ చదవుతున్నాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన మరో యువకుడు.. క్షురకుడు. ఆయన కూడా కామెంట్లే చేశారు. కామెంట్లు చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీసులు.. ఏం చెప్పాలనుకుంటున్నారు..?

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారనేది.. షర్మిల ఫిర్యాదు. ఆ ఫిర్యాదుకు ఆమె కొన్ని యూట్యూబ్ లింకుల అడ్రస్‌లు ఇచ్చారు. ఆ యూట్యూబ్ లింక్‌ల ఆధారంగా.. ఆ వీడియోలు ఎవరు అప్ లోడ్ చేశారు…ఏ ఐపీ అడ్రస్‌లల నుంచి అప్ లోడ్ చేశారన్నది తెలుసుకోవడం… గంటలో పని. అయినప్పటికీ.. పోలీసులు రోజుల తరనబడి నాన్చి.. యూట్యూబ్‌కు లేఖలు రాశామని.. మరో పనికి మాలిన కారణం చెబుతూ.. టైం పాస్ చేస్తూ వస్తున్నారు. అసలు అలా దుష్ప్రచారం చేసిన వీడియోలు ఉంటే… వారిని అరెస్ట్ చేయాల్సింది. కానీ.. వారి జోలికి పోకుండా… ఆ వీడియోలు కింద కామెంట్లు చేశారంటూ.. ఇద్దరు యువకుల్ని… అరెస్ట్ చేసి.. వారిని మీడియా ముందు అతి పెద్ద నేరస్తులుగా క్రియేట్ చేయడం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ పోలీసులకే తెలియాలి..!

నిజానికి ఏదైనా పొలిటికల్ వీడియో వస్తే.. దాని కింద.. వచ్చే కామెంట్లన్నీ… అసభ్యకరంగానే ఉంటాయి. ఎవరూ.. ఎలాంటి పద్దతులు పాటించరు. ఆ విషయం అందరికీ తెలుసు. అలా కామెంట్ చేసినందుకే.. టార్గెట్‌గా పెట్టుకుని మరీ.. ఓ తెలంగాణ యువకుడ్ని… మరో ఆంధ్ర యువకుడ్ని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఈ విషయంలో తెలంగాణలో పోలీసులు రాజకీయ లక్ష్యాలను సాధించి పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి కామెంట్లు పోస్టులు పెట్టకుండా… ఇతర రాజకీయ పార్టీల సానుభూతి పరుల్ని.. కట్టడి చేయడానికి.. షర్మిల కేసును ఉపయోగించుకుంటున్నారా… అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో.. షర్మిల- ప్రభాస్‌కు సంబంధం అంటూ.. వీడియోలు అప్ లోడ్ చేసిన వారంటూ.. ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు పెట్టారో లేదో తెలియదు. కానీ కొత్తగా కామెంట్లు చేసిన వారిని మాత్రం అరెస్ట్ చేశారు. ఇలా .. కామెంట్లు చేసే వారిని అరెస్ట్ చేయాల్సి వస్తే… లక్షల్లో తేలతారు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close