ర‌మ్య‌కృష్ణ‌కు త‌ల‌బిరుసా?

ర‌మ్య‌కృష్ణ త‌ల‌బిరుసున్న వ్య‌క్తిగా న‌టిస్తున్నారా? ఆమె పాత్ర పొగ‌రుగా వ్య‌వ‌హ‌రిస్తుందా? అంటే `అవును…` అనే అంటున్నాయి `దేవ్‌` వ‌ర్గాలు. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌ల్లిగా న‌టించారు ర‌మ్య‌కృష్ణ‌. శివ‌గామి ఈ చిత్రంలో సింగిల్ మ‌ద‌ర్‌గా క‌నిపించ‌నున్నారు. భ‌ర్త‌కు దూరంగా ఒంటిచేత్తో అమ్మాయిని పెంచ‌డ‌మే కాకుండా, త‌న చుట్టూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్ప‌ర‌చుకున్న మ‌హిళ‌గా ఆ పాత్ర‌ను డిజైన్ చేశార‌ట ద‌ర్శ‌కుడు ర‌జ‌త్ ర‌విశంక‌ర్‌. ఆమె వేసే ప్ర‌తి అడుగులోనూ, ఆమె ప్ర‌తి మాట‌లోనూ ఒక‌ర‌క‌మైన ఆత్మ‌విశ్వాసం, స్వ‌యంకృషితో ఎదిగిన ఆత్మ‌స్థైర్యం, ధీమా ఉంటాయ‌ని స‌మాచారం. ఈ నెల 14న `దేవ్‌` ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇది ప్రేమ క‌థా చిత్ర‌మ‌నే బ‌జ్ ముందు నుంచీ ఉన్న‌ప్ప‌టికీ, ఇది ప్ర‌తి విష‌యాన్నీప్రేమించాల‌ని, ప్రేమించ‌డ‌మంటే పండుగ‌లాంటిద‌ని చెప్పే సినిమా అని కోలీవుడ్ టాక్‌. ఈ సినిమా కోసం బరువు త‌గ్గి కార్తీ నాజూగ్గా మారాడు. మ‌రోవైపు ప్ర‌కాష్ రాజ్ `సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు` త‌ర‌హా పాత్ర‌లో కార్తీ తండ్రిగా క‌నిపిస్తారు. విలువ‌ల‌కు విలువిచ్చే కేర‌క్ట‌ర్ ఆయ‌న‌ది. సో సాఫ్ట్ ప్ర‌కాష్ రాజ్‌, స్ట్రాంగ్ హెడ్‌ ర‌మ్య‌కృష్ణ తెర‌పై పోటాపోటీగా క‌నిపిస్తార‌న్న‌మాట‌. ఆల్రెడీ `శైల‌జారెడ్డి అల్లుడు`లో అత్త పాత్ర‌లో మెప్పించిన ర‌మ్యకు .. ఇప్పుడు `దేవ్‌` ఎలాంటి క్రేజ్ తెస్తాడో చూడాలి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close