నరేంద్రమోడీకి ‘రెండు వీరతాళ్లు’ వేయాల్సిందే!

మాయాబజార్‌ సినిమా గుర్తుందా? అందులో ఘటోత్కచుడు నిర్వహించే మంత్ర తంత్రాల పాఠశాల ఉంటుంది. అందులో లంబు జంబు అనే ఇద్దరు ప్రత్యేకమైన విద్యార్థులు ఉంటారు. అస్మదీయులు అనే పదాన్ని గురువు నేర్పిస్తే.. దానికి వ్యతిరేక పదం తస్మదీయులు అంటూ కొత్త పదాన్ని సృష్టిస్తాడు జంబు. వీడు కొత్త పదాలు చెబుతున్నాడు దేవరా.. అని గురువు ఫిర్యాదు చేస్తే.. ‘ఎవరూ సృష్టించకుండా భాష ఎలా పెరుగుతుంది.. వెయ్యండి వీడికి రెండు వీరతాళ్లు’ అంటూ అభినందనలు చెబుతాడు ఘటోత్కచుడు. ఈ హాస్య సన్నివేశం సాధారణంగా అందరికీ గుర్తుంటుంది.
ఆ లెక్కన చూసినట్లయితే ఇప్పుడు మన ప్రధాని నరేంద్రమోడీకి కూడా రెండు వీరతాళ్లు వేయాల్సిందే. అవును మరి ఆయన కూడా భాషకు ఒక కొత్త పదాన్ని అందించారు. ఆ కొత్త పదాన్ని భాషా పరంగా, ప్రభుత్వ పరంగా అధికారికంగా గుర్తించడానికి ప్రయత్నం కూడా జరుగుతున్నది. అందుకే మోడీకి రెండు వీరతాళ్లు వేస్తే సరిపోతుంది.
ఇటీవల తన ప్రసంగంలో మోడీ అంగవైకల్యం వారి గురించి అలా కించపరిచేలాంటి పదజాలంతో కాకుండా ‘దివ్యాంగ’ అంటూ సంబోధించారు. ఇంగ్లిషులో అయితే వీరిని గౌరవప్రదంగా సంబోధించడానికి ప్రత్యేకమైన పదం ఉంది. ఇదివరలో డిజేబుల్డ్‌, హ్యాండిక్యాప్‌డ్‌ అనే పదాలే ఉండేవి. ఇప్పుడు వారిని అలా కించపరిచినట్లు కాకుండా.. డిఫరెంట్లీ ఏబుల్‌డ్‌ అని సంబోధిస్తున్నారు. అయితే వీరికి స్వభాషలో కూడా మరింత గౌరవ ప్రదమైన పదాన్ని సృష్టిస్తూ ‘దివ్యాంగ’ అని మోడీ సంబోధించారు. ఆమేరకు ‘వికలాంగ’ అనే పదం ఇక వాడరు. దీనికి చట్టబద్ధత కల్పించడానికి అందరూ తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కేంద్ర సామాజిక మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఒక లేఖ రాసింది. మొత్తానికి నరేంద్రమోడీ భాషకు ఒక గౌరవప్రదమైన పదాన్ని అందించినట్లయింది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close