మోడీ ప్రచార ఖర్చు బీజేపీ భరించిందా..? ప్రజలు నిలదీయవద్దా..?

నాలుగేళ్లలో మోడీ ప్రచార వ్యయం : రూ. 5,245.73 కోట్లు
విదేశీ పర్యటనలకు మోడీ చేసిన ఖర్చు : రూ.2014 కోట్లు

ఇది అధికారికంగా పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం తెలిపిన సమాచారం. ఇక రెండు నెలల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దేశం మొత్తం తిరుగుతున్నారు. బహిరంగసభల్లో పదే పదే ప్రసంగిస్తున్నారు. ఒక్క రోజే మూడు రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఈ ఖర్చంతా ఎవరిది..? అచ్చంగా… ప్రజల డబ్బు. మోడీ గుంటూరు సభలో.. బహిరంగసభకు అయిన ఖర్చు గురించి… కన్నా లక్ష్మినారాయణను అడిగినట్లు.. ఓ స్కిట్ ప్రదర్శించారు. బీజేపీ కార్యకర్తల ఖర్చుతోనే అదంతా పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ.. బీజేపీ సభ వెనుక ఓ చిన్న టెంట్ వేసి.. అందులో.. కృష్ణపట్నం, విశాఖల్లో.. రెండు పెట్రోలియం ట్యాంకుల నిర్మాణం కోసం.. శంకుస్థాపన లాంటి కార్యక్రమం ఎందుకు చేశారు..?. ఇక్కడే ఉంది లాజిక్ అంతా..!

అధికారిక కార్యక్రమం పేరుతో… ప్రధాని మోడీ గుంటూరుకు వచ్చారు. ఆయన ఖర్చులన్నీ ప్రభుత్వ ఖాతాలో వేశారు. గుంటూరులో.. ఓ టెంట్ మాత్రం.. బీజేపీ ఖర్చుతో వేశారు. ఇది ఒక్క గుంటూరులోనే కాదు.. గత రెండు నెలలుగా.. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర్నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ.. బీజేపీ తిరిగిన అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే జరిగింది. కేంద్రం చేపట్టిన.. లేదా చేపట్టబోయే ప్రాజెక్ట్ పేరుతో.. అధికారిక పర్యటనకు.. ఆయా రాష్ట్రాలకు వెళ్తారు. అది ఐదారు నిమిషాల్లో ముగించేస్తారు. మిగతా సమయం అంతా… ఎన్నికల ప్రచారానికి కేటాయిస్తాయి. అంటే.. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ సభలకు.. టెంట్లు మాత్రమే బీజేపీ ఖర్చు. మిగతా వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఖాతా నుంచే వస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు నెలల ముందు మోడీ ఎన్నికల ప్రచారసభలు ప్రారంభించడానికి కారణం.. ప్రజాసొమ్మును ఇలా.. పార్టీ ప్రచారం కోసం వాడుకోవడానికే. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. ప్రధాని హోదాలో ఆయనకు చాలా పరిమిమైన సౌకర్యాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మిగతావన్నీ.. బీజేపీ ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు అయితే.. ఆయన ఖర్చంతా.. ప్రభుత్వం ఖాతాలో.. పడిపోతుంది. ఇలా వందల కోట్లు మోడీ ఖర్చు పెట్టేసి ఉంటారు. ఇవన్నీ వేరే ప్రభుత్వం వస్తే లెక్కలు బయటకు వస్తాయి.

ఇంత చేస్తున్న మోడీ మాత్రం … టీడీపీ అధినేత.. చేస్తున్న ఖర్చు గురించి చెబుతున్నారు. పార్టీ పరంగా కాకుండా.. కేవలం ప్రభుత్వం పరంగా.. నిరసన వ్యక్తం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఫెడరల్ వ్యవస్థలో.. కేంద్రం అనే దానికి ప్రత్యేకమైన అస్థిత్వం లేకపోయినా.. తమ రాష్ట్రాల నుంచి పన్నుల వాటాలతో ఆదాయం పొందుతూ..తమపైనే పెత్తనం చేస్తున్న వైనాన్ని అధికారికంగా..ఆయన నిరసన ద్వారా తెలియజేయాలనుకున్నారు. అందుకే ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నారు. దీనికే..మోడీ… ప్రజాధనం అంటూ.. విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్నది రాజకీయ పరమైన ఖర్చు అయితే.. మోడీ చేస్తున్నది అంతకు వంద రెట్లు ఎక్కువగా ఉంది మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ ను పతనావస్తకు చేర్చుతున్న కేసీఆర్..!?

బీఆర్ఎస్ ఉనికికి పరీక్షలా మారిన లోక్ సభ ఎన్నికల్లో గులాబీ బాస్ ప్రసంగం పేలవంగా ఉంటుందా..? కాంగ్రెస్ ను ఇరకాటంలో నెట్టకపోగా బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపేలా ఆయన ప్రసంగం ఉంటుందా..? ...

కాంగ్రెస్ అలర్ట్…బీఆర్ఎస్ కోవర్టులపై యాక్షన్..!!

కాంగ్రెస్ సర్కార్ ను బద్నాం చేసేందుకు ఆయా శాఖల అధికారులు కుట్రలు చేస్తున్నారా..? గోప్యంగా ఉంచాల్సిన కీలక సమాచారాన్ని బీఆర్ఎస్ కు చేరవేస్తున్నారా..? ఇరిగేషన్ , విద్యుత్ శాఖలో మాత్రమే కాకుండా ఇతర...

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close