గోపీచంద్ – సంప‌త్ నంది… ఈ కాంబో ఎప్పుడు..?

వ‌రుస ప‌రాజ‌యాలు ఎదురైనా… గోపీచంద్‌కి డిమాండ్ త‌గ్గ‌లేదు. ఆల్రెడీ తిరుతో ఓ సినిమా మొద‌లెట్టేశారు. ఈ సినిమాకి బ‌డ్జెట్ రూ.30 కోట్ల పైమాటే. ఇప్పుడు సంప‌త్‌నంది సినిమా కూడా మొద‌ల‌వ్వబోతోంద‌ని టాక్‌. గోపీచంద్ – సంప‌త్‌నంది కాంబోలో ఇది వ‌ర‌కు `గౌత‌మ్ నందా` వ‌చ్చింది. ఆసినిమా అంతంత‌మాత్రంగానే ఆడింది. అయినా స‌రే.. సంప‌త్‌పై న‌మ్మ‌కం ఉంచాడు గోపీచంద్‌. వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌బోతోంది. `బెంగాల్ టైట‌ర్‌` నిర్మాత కె.కె.రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. స్క్రిప్టు ప‌నులు ఓ కొలిక్కి వ‌చ్చాయి. ఏప్రిల్ లో చిత్రీక‌ర‌ణ మొద‌లెడ‌తారు. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందించ‌నున్నాడు. గోపీచంద్ సినిమాకి మిక్కీ పాట‌లు అందించ‌డం ఇదే తొలిసారి. ప్ర‌స్తుతం క‌థానాయిక కోసం అన్వేషిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం రెడీ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close