అమితాబ్‌ ఇప్పటిదాకా మనకోసం ఏం చేశాడని?

మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రజలకు ఇప్పటిదాకా గుర్తున్నదో లేదో తెలియదు గానీ.. అమితాబ్‌ బచ్చన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఆయనను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తూ.. ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే మంత్రి కామినేని ఒక ప్రకటన చేశారు. ఈ నియామకంపై అమితాబ్‌ బచ్చన్‌ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయి. అంటే గుజరాత్‌ టూరిజం శాఖకు చేస్తున్నట్టుగానే.. ఏపీ ఆరోగ్య శాఖకు కూడా అమితాబ్‌ బచ్చన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నమాట. మరి ఈ ఏడాదిన్నర కాలంలో ఏపీ కోసం, అక్కడి ఆరోగ్యశాఖ వారి ప్రచారం కోసం బ్రాండ్‌ అంబాసిడర్‌ హోదాలో.. అమితాబ్‌ బచ్చన్‌ ఏం చేశారు? చేసిందేమీ లేదు! కనీసం మన ప్రభుత్వం కోసం ఆయన ఇప్పటిదాకా ఒక్క నిమిషం సమయాన్నయినా వెచ్చించింది లేదు. అంటే కేవలం బ్రాండ్‌ అంబాసిడర్‌ నియామకాలు అనేవి ఫక్తు మొక్కుబడిగా తయారవుతున్నాయని స్పష్టంగా తెలిసిపోతోంది.

ఏపీ ప్రభుత్వం ఏం మాయలో పడి ఉన్నదో గానీ స్మార్ట్‌ గ్రామాలు, వార్డులు పేరిట మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో తాము చేపట్టదలచుకున్న అభివృద్ధి కార్యక్రమాలకు కూడా బ్రాండ్‌ అంబాసిడర్లను నియమించాలని తాజాగా సంకల్పిస్తున్నది. ఈ ‘స్మార్ట్‌’ అభివృద్ధికోసం ప్రతి జిల్లాకు ప్రముఖ పారిశ్రామిక వేత్తలను బ్రాండ్‌ అంబాసిడర్లు గా నియమించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్మార్ట్‌ ఏపీ ఫౌండేషన్‌ ను కూడా రతన్‌టాటా, ఆనంద్‌ మహీంద్ర, విప్రో ప్రేంజీ వంటి వారికి అప్పగించాలని చూస్తున్నట్టు చెబుతున్నారు.

అయితే జిల్లాలను కూడా రాష్ట్రస్తాయి పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గల్లా రామచంద్రనాయుడు, వరప్రసాద్‌రెడ్డి, మండవ ప్రభాకరరావు లాంటి వాళ్లను ఎంపిక చేస్తున్నారు. అయితే వీరు అప్పగించిన జిల్లా వ్యాప్తంగా స్మార్ట్‌ పనులను ముందుకుతీసుకువెళ్లడానికి తమ సమయం వెచ్చిస్తారా? లేదా, నాంకేవాస్తే బ్రాండ్‌ అంబాసిడర్లుగా ముద్ర వేయించుకుని.. అమితాబ్‌ బచ్చన్‌లాగా మొక్కుబడిగా ఉంటారా అనేది కీలకం.

నిజంగా క్షేత్రస్థాయిలో ఉపయోగపడలేకపోతే.. ఈ బ్రాండ్‌ అంబాసిడర్ల వ్యవస్థ మొత్తం నిరుపయోగం అని ఎవరి ముఖప్రీతి కోసం ఈ నియామకాలు చేపట్టం వృథా అని జనం భావిస్తున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ రివ్యూ: కాన్సెప్ట్ విత్ లాజిక్!

Prasanna Vadanam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ 2.75/5 -అన్వ‌ర్‌ ఈరోజుల్లో ప్రేక్ష‌కుల‌కు విజువ‌ల్ ఎక్స్‌పీరియ‌న్స్ అయినా ఇవ్వాలి, లేదంటే కాన్సెప్ట్ తో అయినా క‌ట్టి ప‌డేయాలి. ఈ రెండింటిలో ఏది లేక‌పోయినా సినిమా...

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కుదరదన్న తెలంగాణ హైకోర్టు

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి గుడ్ న్యూస్ లు వరుసగా వినిపిస్తున్నాయి. అప్రూవర్ గా మారిన దస్తగిరి తనను జైల్లో పెట్టి.. పెద్ద ఎత్తున ప్రలోభపెట్టడమే కాకుండా......

‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ: క్లాసిక్ టైటిల్ చెడ‌గొట్టారు

Aa Okkati Adakku Movie review తెలుగు360 రేటింగ్ 2.25/5 -అన్వ‌ర్‌ ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ వుండేది. తర్వాత పరిస్థితి మారింది. ఆయనపై కామెడీ కథలు సరిగ్గా...

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close