మరోసారి పోలీస్ గా బాలయ్య..!

నందమూరి నట సింహం 99వ సినిమా డిక్టేటర్ విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. సంక్రాంతి సినిమాల్లో మరోసారి తన సత్తా చాటిన బాలయ్య ఇక తన వందో సినిమా మీద చర్చలు నడుపుతున్నాడు. చరిత్రలో మిగిలిపోయేలా బాలయ్య వందో సినిమా ఉంటుందని తెలుసు.. అయితే ఆదిత్య 369 సీక్వల్ ఇప్పటికే బాలయ్య తర్వాత సినిమాగా ఓకే చేయబడ్డా ఇటీవల అనీల్ రావిపూడి చెప్పిన కథ నచ్చడంతో పచ్చ జెండా ఊపేశాడట బాలయ్య. స్క్రిప్ట్ ఫైనల్ చేసుకు రమ్మని చెప్పాడట పటాస్ డైరక్టర్ అనీల్ రావిపూడికి.

రామారావుగారుగా వస్తున్న ఈ సినిమాలో బాలయ్యను ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో చూపించబోతున్నాడట అనీల్. తన మొదటి సినిమా పటాస్ లో కూడా కళ్యాన్ రాం ను పోలీస్ పాత్రలోనే చూపించి హిట్ కొట్టాడు ఈ దర్శకుడు. ఇప్పుడు మరోసారి బాలయ్యను కూడా అదే కాప్ పాత్రలో చూపించబోతున్నాడట. అయితే అనీల్ కథ మెచ్చిన బాలయ్య ఆ సినిమాను వందో సినిమాగా చేస్తాడా లేక 101 వ సినిమాగా చేస్తాడా అన్నది ఇంకా తెలియలేదు. ఇప్పటికైతే బాలయ్య వందో సినిమా ఆదిత్య 999 అనే గట్టిగా చెబుతున్నారు.

పటాస్ సినిమా హిట్ తర్వాత ప్రస్తుతం సాయి ధరం తేజ్ సుప్రీం సినిమాను దర్శకత్వం చేస్తున్నాడు అనీల్ రావిపూడి.. ఇటీవల సాయి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సుప్రీం టీజర్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మొత్తానికి మూడో సినిమానే బాలయ్య లాంటి స్టార్ హీరోతో అవకాశం కొట్టేశాడంటే దర్శకుడు అనీల్ రావిపూడి వెరీ లక్కీ అని చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close