న‌రేష్ న‌న్ను అవ‌మానించాడు: శివాజీరాజా కంట‌త‌డి

‘మా’ ఎన్నిక‌ల ముహూర్తం ద‌గ్గ‌ర ప‌డే కొద్దీ.. అటు న‌రేష్ వ‌ర్గం, ఇటు శివాజీ రాజా వ‌ర్గం అమ్ముల పొదిలో దాగున్న ప్ర‌ధాన అస్త్రాల‌ను ఒకొక్క‌టిగా సంధిస్తున్నారు. ‘మా’ క‌మిటీలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, నిధుల దుర్వినియోగం జ‌రుగుతోంద‌ని, ‘మా’ ప‌రువు బ‌జారుకీడ్చేలా కొన్ని ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని ఇటీవ‌ల జీవిత రాజ‌శేఖ‌ర్ ఆరోపించారు. న‌రేష్ కూడా కొన్ని ఘాటైన విమ‌ర్శ‌లు చేస్తున్నాడు.

ఇప్పుడు శివాజీ రాజా వాళ్లంద‌రికీ ఓ కౌంట‌ర్ ఇచ్చాడు. ”మేమంతా స్వ‌చ్ఛ‌మైన‌వాళ్లం. ఏ త‌ప్పూ చేయ‌లేదు. `మా` అధ్య‌క్షుడిగా రెండోసారి పోటీ చేయ‌డం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ అంద‌రూ ఈసారికి పోటీ చేయ‌మ‌ని బ‌ల‌వంతం చేశారు. అందుకే… నిల‌బ‌డ్డాను. ఇటీవ‌ల కొంత‌మంది నాపై ఆరోప‌ణ‌లు చేశారు. వాటికి సమాధానం చెప్ప‌క‌పోతే అవే నిజం అనుకునే ప్ర‌మాదం ఉంది. అందుకే ఇలా మాట్లాడాల్సివ‌స్తోంది. ఎవ‌రైనా మీడియా ముందుకొచ్చేట‌ప్పుడు నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది. మేం చేసిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చూసి మాకు ఓటేయండి” అన్నారు. అంతేకాదు… న‌రేష్ వైఖ‌రిపై ఆయ‌న తొలిసారి పెద‌వి విప్పారు.

చిరంజీవి ఆధ్వ‌ర్యంలో `మా` నిధుల కోసం ఓ కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టిన‌ప్పుడు న‌రేష్ పిలిచినా రాలేద‌ని, అప్పుడు శ్రీ‌కాంత్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయ‌గ‌లిగామ‌ని గుర్తు చేశాడు శివాజీరాజా. ‘మా’లోని ప్ర‌తి స‌భ్యుడి పుట్టిన రోజున‌.. ఆ స‌భ్యుడ్ని క‌లిసి, పుష్ష‌గుచ్ఛం ఇచ్చి అభినందించ‌డం ఓ రివాజుగా మార్చామ‌ని, అయితే త‌న పుట్టిన రోజున న‌రేష్ త‌న‌ని అవ‌మానించాడ‌ని వ్యాఖ్యానించారు శివాజీ రాజా.

”పుట్టిన రోజున ఫోన్ చేసి క‌లుద్దామ‌న్నాడు న‌రేష్‌. త‌న కోసం ఛాంబ‌ర్‌కి వెళ్లి చాలాసేపు ఎదురుచూశా. కానీ న‌రేష్ రాలేదు. ఈలోగా మ‌రో వ్య‌క్తికి న‌రేష్ ఫోన్ చేసి `చూశావా.. పుట్టిన రోజున నా కోసం శివాజీ రాజాని ఎదురు చూసేలా చేశాను. అదీ నా స్థాయి` అని మాట్లాడాడ‌ట‌” అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ అవ‌మానాలు భ‌రించ‌లేక‌.. ఇంట్లోవాళ్లు ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయొద్ద‌ని చెప్పార‌ని, అయితే కేవ‌లం తాను మొద‌లెట్టిన కొన్ని అభివృద్ది కార్య‌క్ర‌మాలు మ‌ధ్య‌లోనే ఆగిపోతాయ‌న్న కార‌ణంతోనే తాను మ‌ళ్లీ పోటీ చేయాల్సివ‌చ్చింద‌ని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు శివాజీ రాజా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close