విశాఖలో భాజ‌పా హ‌డావుడి క‌నిపించ‌డం లేదేం..?

గత నెలాఖరున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది! ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఆశ‌ల్ని అర్థం చేసుకున్నామ‌నీ, అందుకే రైల్వే జోన్ ఇస్తున్నామంటూ ప్ర‌క‌టించారు. అంతేకాదు, విశాఖ‌ను తాము చాలా అభివృద్ధి చేశామ‌నీ, జోన్ ఇచ్చిన ఘ‌న‌త భాజ‌పాకి ద‌క్కింద‌నీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌న్నారు. విశాఖ స్మార్ట్ సిటీకి చాలా నిధులు ఇచ్చామ‌న్నారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను మ‌రింత విస్త‌రిస్తామ‌న్నారు. విశాఖ విమానాశ్రయానికి అంత‌ర్జాతీయ హోదా క‌ల్పించిన ఘ‌న‌త కూడా భాజపాకి ద‌క్కుతుంద‌నీ ప్ర‌ధాని చెప్పారు. విశాఖ స‌భ అనంత‌రం న‌గ‌రంలో భాజ‌పా నేత‌లు కొద్దిరోజులపాటు హ‌డావుడి చేశారు. స్థానిక మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూ… రాబోయే ఎన్నిక‌ల్లో భాజ‌పాకి విశాఖలో గొప్ప ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌నే ధీమాతో క‌నిపించారు.

అయితే, ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న ఈ స‌మ‌యంలో విశాఖ‌లో క‌మ‌లనాథుల హ‌డావుడే క‌నిపించ‌డం లేదు. విశాఖ‌లో కొంత ప్ర‌భావం చూపే దిశ‌గా పార్టీ వ్యూహాలు కూడా ప‌క్కాగా ఉంటాయ‌ని అనుకుంటే… రానురానూ భాజ‌పా జోష్ చ‌ల్లారిపోయిన‌ట్టుగా క‌నిపిస్తోంది. విశాఖ‌లో ఎంపీ కంభంపాటి హ‌రిబాబు ఉన్నారు. ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైయ‌స్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ మీద భారీ మెజారిటీతో హ‌రిబాబు గెలిచారు. కానీ, తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేస్తారా లేదా అనే అనుమానం వ్య‌క్త‌మౌతోంది. అంతేకాదు, విశాఖలో భాజ‌పా త‌ర‌ఫున సీరియ‌స్ గా ప‌నిచేసే నాయ‌కులు ప్ర‌స్తుతం లేర‌నే చెప్పాలి. కొత్తవారూ కనిపించడం లేదు.

ద‌క్షిణాదిలో భాజ‌పా బ‌ల‌ప‌డేందుకు కావాల్సిన పునాదులు ఆంధ్రా నుంచి ప‌డ‌తాయంటూ ఈ మ‌ధ్య‌నే ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు చెప్పారు! రాష్ట్ర ప్ర‌భుత్వ ఏర్పాటులో తమ పాత్ర కీలకంగా మారుతుందంటూ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ చాలాసార్లు చెప్పారు! అయితే, ఇవ‌న్నీ కేవ‌లం మైకుల ముందు ప్ర‌క‌ట‌న‌లుగా మాత్ర‌మే క‌నిపిస్తోంది. అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలోగానీ, అభ్య‌ర్థుల‌ను అన్వేషించే విష‌యంలోగానీ రాష్ట్ర నాయ‌క‌త్వం చొర‌వ తీసుకుంటున్నట్టు క‌నిపించ‌డం లేదు. జాతీయ నాయ‌క‌త్వానికి కూడా త‌త్వం బోధ‌ప‌డ్డ‌ట్టుగానే క‌నిపిస్తోంది. విశాఖ‌కు రైల్వే జోన్ ప్ర‌క‌టించేస్తే… అక్క‌డ ఊపు వ‌చ్చేస్తుంద‌ని అనుకుని ఉంటారు. సాక్షాత్తూ ప్ర‌ధాని వ‌చ్చి మ‌రీ స్వ‌యంగా జోన్ ప్ర‌క‌టించినా… ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రావ‌డం లేదంటే ప‌రిస్థితి ఎలా ఉందో ఇప్ప‌టికైనా భాజ‌పా నేత‌లు అర్థం చేసుకుంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close