ఉత్తమ్‌కు గుదిబండ కట్టిన రాహుల్..! నల్లగొండ లోక్‌సభకు పోటీ చేయాలని ఆదేశం..!

నల్లగొండ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాహుల్ గాంధీ ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం. వరుసగా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల ఘటనలతో… శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపాలంటే.. పెద్ద నేతలంతా ఎన్నికల్లో పోటీ చేయాలని ఏఐసిసి హైకమాండ్ భావిస్తోంది. అందులో భాగంగానే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వంపై చర్చ జరిపారు. రాహుల్‌గాంధీ సమక్షంలోనే ఉత్తమ్ అభ్యర్థిత్వంపై చర్చ జరిగింది. కేడర్‌లో మనోధైర్యం నింపేందుకు పోటీ చేయాలని ఉత్తమ్‌కు రాహుల్‌ సూచించారు. ఏకగ్రీవంగా ఉత్తమ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆదిలాబాద్-రమేష్ రాథోడ్, మహబూబాబాద్-బలరాం నాయక్, పెద్దపల్లి -ఎ.చంద్రశేఖర్, కరీంనగర్-పొన్నం ప్రభాకర్, మల్కాజిగిరి-రేవంత్ రెడ్డి, జహీరాబాద్-మదన్ మోహన్, చేవెళ్ల-కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్-గాలి అనిల్ కుమార్ పేర్లను ప్రకటించింది. సీనియర్ నేతలు బరిలో ఉంటేనే టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగలమని కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నల్లగొండ నుంచి జానారెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేసులో ఉంటారని ప్రచారం జరిగింది. చివరకు టీ పీసీసీ చీఫ్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు కాంగ్రెస్ అధినాయకత్వం మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇక భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య పేర్లు కూడా దాదాపుగా ఖరారయ్యాయి.

పీసీసీ చీఫ్ ఎన్నికల బరిలో దిగడానికి మొదట సుముఖత వ్యక్తం చేయలేదు. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన కొద్ది తేడాతో విజయం సాధించారు. అయితే.. ఆయన నాయకత్వంపై.. సొంత పార్టీలోనే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నా.. పట్టించుకోవడం లేదని.. ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో.. ఆయన నాయకత్వంలో పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొంటే.. అభ్యర్థులకు చిక్కులు తప్పవన్న ఫిర్యాదులు హైకమాండ్ కు వెళ్లాయి. దాంతో రాహుల్ గాంధీ… ఉత్తమ్ నే నేరుగా రంగంలోకి దించాలని డిసైడయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి.. ఉత్తమ్ బాధ్యత తీసుకోలేదు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో కంచుకోట లాంటి చోట విజయం సాధించకపోతే… ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ వైదొలగక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కొసమెరుపేమిటంటే.. ఏపీలో నంద్యాల ఉపఎన్నికల తర్వాత.. నల్లగొండకు ఉపఎన్నిక వచ్చేలా చేయాలని కేసీఆర్ అనుకున్నారు. ఆ సమయంలో.. తానే పోటీ చేస్తానంటూ.. ఉత్తమ్ ఉత్సాహం చూపించారు. ఇప్పుడు వెనుకడుగు వేసినా పోటీ చేయక తప్పదని తేలిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close