బీజేపీ నేతలను ఎందుకు జగన్ పార్టీలో చేర్చుకోవడం లేదు..?

వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలపై గురి పెట్టారు. టిక్కెట్లు రాని నియోజకవర్గ స్థాయి నేతలకు.. ఓ విలువ కట్టి మరీ కండువాలు కప్పేస్తున్నారు. ఈ చేరికల కోసం.. ఆయన ఓ రోజు ప్రచారాన్ని నిలిపి వేసి.. లోటస్‌పాండ్‌లో … కండువాలతో కూర్చున్నారు కూడా. అలా చేరుతున్న వాళ్లంతా.. మెజార్టీ తెలుగుదేశం పార్టీ నేతలే. కొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు. ఎవరికీ అర్థం కాని విషయం ఏమిటంటే.. అంతో.. ఇంతో ఉన్న.. బీజేపీ నేతల జోలికి ఆయన ఎందుకు వెళ్లడం లేదు..? జగన్మోహన్ రెడ్డి వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు..?.

భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏపీలో ఎలా ఉందో .. అందరికీ తెలుసు. అయితే.. ఆ పార్టీకి కొంత మంది నేతలు ఉన్నారు. టీడీపీతో పొత్తు ఉన్న కారణంగా గత ఎన్నికలకు ముందు చాలా మంది నేతలు ఆ పార్టీలో చేరారు. రాజకీయ భవిష్యత్ కోసం.. ఆ పార్టీలో చేరిన వారు.. ముందు నుంచీ ఆ పార్టీలో ఉన్న నేతలు కూడా ఉన్నారు. వారిలో చాలా మంది.. ఇప్పటి బీజేపీ పరిస్థితిని చూసి… ఏ పార్టీలోకి వెళ్దామా అని చూస్తున్నారు. ఎన్నికల సమయంలో.. తమకు చాలా అవకాశాలు వస్తాయని… ఎంతో కొంత వర్కవుట్ అవుతుందని ఆశ పడ్డారు. ఎలాగూ.. టీడీపీ వారి వైపు చూడదు. కానీ.. చేరికలతో ప్రభంజనం సృష్టించాలనుకుంటున్న వైసీపీ ఎందుకు చూడటం లేదనే ప్రశ్న వారిని వేధిస్తోంది.

నిజానికి కావూరి సాంబశిరావును పార్టీలోకి తీసుకుని ఏలూరు టిక్కెట్ ఇవ్వాలని జగన్ చాలా ఆశ పడ్డారు. కానీ బీజేపీ హైకమాండ్ పడనీయలేదని ప్రచారం జరుగుతోంది. కావూరి దగ్గర్నుంచి చాలా మంది బీజేపీ నేతలు… అవకాశం ఇచ్చినా.. లేకపోయిన తర్వాత అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినా.. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. అంత ఎందుకు.. ఏకంగా కన్నా లక్ష్మినారాయణే ఆ పార్టీలో చేరడానికి సిద్ధం అయ్యారు. చివరి క్షణంలో ఆగిపోయారు. అలాంటి పరిస్థితి ఉంది. చేరడానికి ఎవరు ఆసక్తి చూపినా వైసీపీ నేతలు మాత్రం.. ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు. తమ పార్టీ నేతల్ని చేర్చుకుంటే… అమిత్ షా ఆగ్రహిస్తారేమోనని కోపం కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close