న‌రేష్‌పై అలిగిన జీవిత‌, రాజ‌శేఖ‌ర్, హేమ‌

‘మా’లో న‌రేష్ ప్యాన‌ల్ గెలిచి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. ప్ర‌మాణ స్వీకారం రోజునే `మా`లో లుక‌లుక‌లు బ‌య‌ట ప‌డ్డాయి. న‌రేష్ ప్ర‌తీదానికీ ‘నేనూ.. నా’ అనే మాట‌లు ఎక్కువ‌గా మాట్లాడుతున్నార‌ని – ‘మేము’ అన‌డం లేద‌న్న కొత్త పాయింట్‌ని లేవ‌నెత్తారు రాజ‌శేఖ‌ర్ దంప‌తులు. `మా`లో వీళ్లూ గెలిచిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం న‌రేష్ అడ‌గ‌డం వ‌ల్లే వీరిద్ద‌రూ ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. `నా చెల్ల‌మ్మా.. నా ముద్దుల బావ‌` అంటూ న‌రేష్ ఎన్నిక‌ల ముందు వీరిద్ద‌రినీ నెత్తిన ఎక్కించుకున్నాడు. ఇంత‌లోనే… వీళ్ల మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. `న‌రేష్ గారు అంద‌రినీ క‌లుపుకుపోవాలి ఆయ‌న కంగారులో `నేనూ.. నేనూ` అంటున్నారేమో..` అంటూ ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వ స‌భ‌లోనే జీవిత చుర‌క‌లు వేసింది. `ఈమాత్రం దానికే మాలో మాకు గొడ‌వ‌లు వ‌చ్చాయ‌నుకోకండి. మేమంతా ఒక్క‌టే. క‌ల‌సి ప‌నిచేస్తాం` అంటూ రాజ‌శేఖ‌ర్ క‌వ‌రింగు ఇచ్చాడు.

అయితే హేమ మాత్రం న‌రేష్ తీరుపై చిరుబురులాడుతోంది. ఓ దశ‌లో హేమ మాట్లాడాల‌ని మైకు అందుకుంటే దాన్ని న‌రేష్ లాగేసుకున్నాడు. దాంతో హేమ మరింత ఫైర్ అయ్యింది. ‘న‌రేష్ గారి ప‌ద్ద‌తి ఏం బాలేదు. మైకు లాగేసుకోవ‌డం ఏంటి` అంటూ అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించింది. న‌రేష్ ఒక్క‌రే నిర్ణ‌యాలు తీసుకోవ‌డం స‌రికాద‌ని, ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా న‌రేష్ చెప్పిన మాట‌లు, ఇచ్చిన హామీల‌న్నీ త‌న‌కు తాను తీసుకున్న‌వ‌ని, వాటిని జ‌న‌ర‌ల్ బాడీలో చ‌ర్చించాక అప్పుడు మాట్లాడితే బాగుంటుంద‌ని హేమ సూచించారు. మొత్తానికి ప్ర‌మాణ స్వీకారం రోజునే.. ‘మా’లో అల‌క‌లు మొద‌ల‌య్యాయి. ఈ కాపురం రెండేళ్ల పాటు ఎలా సాగుతుందో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close