పార్టీలో చేరకపోయినా ఆ సీనియర్ల మద్దతు టీడీపీకే..!

ఎన్నికల్లో పోటీకి ఏ పార్టీకి అవకాశం దక్కని ప్రముఖ నేతలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. వైసీపీలో చేరేందుకు లోటస్‌పాండ్‌కు వెళ్లి మరీ కండువా వేసుకోకుండా వెనక్కి వచ్చేసిన అనకాపల్లి నేత కొణతాల రామకృష్ణ.. తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు. మూడు రోజుల పాటు.. అనుచరులతో రోజూ సమావేశం జరిపి అభిప్రాయాలు తెలుసుకుని… ఈ నిర్ణయం తీసుకున్నారు. విభజన హామీల కోసం కేంద్రంపై టీడీపీ పోరాటం చేయగలదని నమ్ముతున్నామన్నారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని.. టీడీపీ కోరితే ప్రచారం చేస్తానని ప్రకటించారు. నిజానికి.. ఆయన వైసీపీకి దూరమైన తర్వాత టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ.. ఆయన సీటు విషయంలోనో.. మరో కారణంతోనే.. కానీ వెనుకడుగు వేశారు. పలుమార్లు చంద్రబాబును కలిసినప్పటికీ ఏ విషయం చెప్పకపోవడంతో.. అభ్యర్థుల్ని కూడా ఖరారు చేశారు. ఆ తర్వాత వైసీపీ వైపు చూశారు. మళ్లీ మనసు మార్చుకున్నారు. ఇప్పుడు టిక్కెట్ లేకపోయినా టీడీపీకి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నారు.

చిత్తూరు జిల్లాకు చెందిన మరో నేత… సీకే జయచంద్రారెడ్డి.. అలియాస్ సీకే బాబు కూడా.. తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. ఆయన చిత్తూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చిత్తూరు నగరాన్ని ఒకప్పుడు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు.. ఆయన పట్టు సడలింది. అయితే.. భారీగా అనుచరవర్గం ఉంది. కాంగ్రెస్‌లో వైఎస్‌కి ఆప్తుడిగా ఉండేవారు. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో జరగకపోతే.. మొదటగా.. అప్పట్లో ఆయన ఇంటికే వెళ్లేవారు. ఆ సెంటిమెంట్ కారణంగా.. సీకే బాబును..జగన్ దూరం పెట్టారన్న ప్రచారం ఉంది. దాంతో ఆయన ఏ పార్టీకి కాకుండా పోయారు. ఇటీవల కూడా కొన్ని పార్టీల్లో టిక్కెట్ కోసం ప్రయత్నించారు. ఏ పార్టీలోనూ కుదరలేదు. ఇప్పుడు టీడీపీకి మద్దతిస్తానని ముందుకు వచ్చారు. చంద్రబాబును కలిసి వెళ్లారు.

ఏ పార్టీలో లేని పలువురు సీనియర్ నేతలు… టీడీపీకి మద్దతిచ్చేందుకు వెనుకాడటం లేదు. టిక్కెట్ ఆశించి పార్టీలో చేరిన హర్షకుమార్.. చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకపోయినా… పాజిటివ్ గానే మాట్లాడారు. జగన్ వస్తే..రాష్ట్రం నాశనమైపోతుందని.. ఈ నేతలంతా… ఆందోళన చెందుతున్నారు. టీడీపీకి మద్దతు ప్రకటిస్తున్నారు. కొంత మంది నేరుగా.. టీడీపీలో చేరుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close