రానా సినిమాలో ట‌బు??

రానా క‌థానాయ‌కుడిగా వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. దీనికి `విరాట ప‌ర్వం` అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. సురేష్ బాబు నిర్మించే ఈ చిత్రం జులై నుంచి సెట్స్‌పైకి వెళ్లుంది. క‌థానాయిక‌గా సాయిప‌ల్ల‌వి ఖారారైంది. అయితే ఓ కీల‌క‌మైన పాత్ర‌లో ట‌బు క‌నిపించ‌నున్న‌ది స‌మాచారం. రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ట‌బు మాన‌వ హ‌క్కుల నేత‌గా క‌నిపించ‌నున్న‌ద‌ట‌. ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మిగిలిన భాష‌ల్లోనూ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. అందుకే… కీల‌క పాత్ర‌ల కోసం పేరెన్న‌ద‌గిన న‌టీన‌టుల్ని ఎంపిక చేస్తున్నారు. స్క్రిప్టు ప‌నులు ఓ కొలిక్కి వస్తున్నాయి. మ‌రోవైపు అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ చిత్రంలో ఓ పాత్ర‌కు గానూ ట‌బు పేరు ప‌రిశీలిస్తున్నారు. ఈ సినిమా కూడా ఒప్పుకుంటే.. ట‌బు చేతిలో ఏక కాలంలో రెండు తెలుగు సినిమాలుంటాయ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close