జగన్ ఓటమే వంగవీటి పంతం..! ప్రచారంలో కీలకంగా రాధా..!

“నేను వదిలేస్తే గాలికిపోతావని” వంగవీటి రాధాను..జగన్మోహన్ రెడ్డి అవమానించారు. దానికి కౌంటర్‌గా తనను వదిలేయడం వల్ల.. జగన్మోహన్ రెడ్డి ఎటు పోతాడోచూపించాలని… వంగవీటి రాధా పట్టుదలగా ఉన్నారు. టిక్కెట్ ఇస్తామన్నా… రాష్ట్ర వ్యాప్త ప్రచారానికే మొగ్గు చూపిన వంగవీటి రాధా… ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్‌గా మారారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత సైలెంట్‌గా ఉన్న వంగవీటి రాధాను.. లగడపాటి రాజగోపాల్ టీడీపీలో చేేలా మధ్య వర్తిత్వం చేశారు. చంద్రబాబు టిక్కెట్ కూడా ఆఫర్ చేశారు. కానీ తన లక్ష్యం జగన్ ఓడిపోవాలన్నదేనని… వంగవీటి చెప్పారు. తన అవసరం ఎక్కడ ఉందో అక్కడకు వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు.

ఇప్పుడు వంగవీటి రాధాను… పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది టీడీపీ. కొన్ని కార్యక్రమాలు పార్టీ చెబుతుందని, మరికొన్ని కార్యక్రమాలకు తనతో పాటు రావాలని సీఎం ఆహ్వానించారు. వెంటనే ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదా కూడా ఇచ్చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు జాబితాను కూడా పంపారు. ఇప్పటికే వంగవీటి రాధా, వల్లభనేని వంశీతో పాటు పలువురు తెలుగుదేశం అభ్యర్దుల నామినేషన్ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. తనకు గట్టి పట్టు ఉన్న … విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొండా ఉమా ఏర్పాటు చేసిన ర్యాలీకి కూడా హాజరయ్యారు.

వంగవీటి రాధాపై బ్యాడ్ రిమార్కులేమీ లేవు. ఆయనకు క్రేజ్ ఉంది. ఓ సామాజికవర్గంలో.. పట్టు ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తరుణంలో… వంగవీటి రాధాను.. పకడ్బందీగా ఉపయోగించుకోవడానికి టీడీపీ ఏర్పాట్లు చేసుకుంది. వంగవీటి రాధా కూడా.. తాను నిజంగా ఎన్నికల్లో నిలబడితే ఎలా కష్టపడతారో… అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. టీడీపీ నేతలతో కలసి పోతున్నారు. మామూలుగా… వల్లభనేని వంశీ, కొడాలి నాని, వంగవీటి రాధా మిత్రులు. వల్లభనేని వంశీకి నేరుగా ప్రచారం చేశారు. కానీ కొడాలి నానికి చేసే అవకాశం లేదు. గుడివాడలో కాపు ఓట్లు ఇప్పుడు కీలకం. అయితే అక్కడ పోటీ దేవినేని అవినాష్ తో కాబట్టి… వంగవీటి రాధా టీడీపీ తరపున ప్రచారానికి రాడని.. కొడాలి నాని ధీమాతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో మోడీ..!?

ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close