సీనియర్లను కేసీఆర్ ప‌క్క‌నపెట్ట‌డం వ్యూహాత్మ‌క‌మేనా..?

తెరాస ఎంపీ అభ్య‌ర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే! అయితే, అసెంబ్లీ ఎన్నిక‌లు మాదిరిగా ఈసారి సిట్టింగులంద‌రికీ టిక్కెట్లు ఇవ్వ‌లేదు. ప్ర‌ముఖుల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టేయ‌డం విశేషం. జితేంద‌ర్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, వివేక్ లాంటి సీనియ‌ర్ల‌ను… ఢిల్లీలో కాస్త బ‌లంగా గొంతు వినిపించే సామ‌ర్థ్యం ఉన్న‌వారికి ఈసారి ప్రాధాన్య‌త లేకుండా చేశారు కేసీఆర్‌! ఇదంతా ప‌నితీరు ఆధారంగా తీసుకున్న నిర్ణ‌య‌మే అని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. స్థానికంగా కొంత వ్య‌తిరేక‌త, అభ్య‌ర్థుల తీరును దృష్టిలో పెట్టుకునే ఎంపీ టిక్కెట్ల కేటాయింపు చేశార‌ని అంటున్నారు. నిజానికి, ఇలాంటి ప్ర‌ముఖుల‌ను ప‌క్క‌న‌పెట్టిన‌ప్పుడు… పార్టీలో కొంత అసంతృప్తి వాతావ‌ర‌ణం క‌నిపించాలి. కానీ ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి. స్థానికంగా కేసీఆర్ మ‌రింత బ‌లంగా ఉన్నారు కాబ‌ట్టి… అవి వ్య‌క్తం కావ‌డం లేద‌ని చెప్పుకోవ‌చ్చు. అయితే, ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక వెన‌క కేసీఆర్ వ్యూహం వేరే ఏదైనా అంత‌ర్లీనంగా ఉందా అంటే… ఉంద‌నే అనిపిస్తోంది.

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా తెరాస పెద్ద సంఖ్య‌లో ఎంపీ స్థానాలు గెలుస్తుంద‌నేది దాదాపు ఖాయం. ఎందుకంటే, గ‌ట్టి పోటీని ఇచ్చేంత చొర‌వ ప్ర‌తిప‌క్షాలు చూపించ‌డం లేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే ఆర్థికంగా అన్ని ర‌కాలుగా న‌ష్ట‌పోయామ‌నీ, ఇప్పుడు మ‌ళ్లీ ఆ స్థాయిలో వ్యయ ప్ర‌యాస‌ప‌డినా ప్ర‌యోజ‌నం ఏముంటుంద‌నే ఒక‌ర‌క‌మైన నిర్లిప్త‌త కాంగ్రెస్ శ్రేణుల్లో క‌నిపిస్తున్నాయి. ఇవ‌న్నీ కేసీఆర్ కి క‌లిసొచ్చే ప‌రిణామాలు. దీంతో ఎన్నిక‌ల త‌రువాత‌… జాతీయ స్థాయిలో తెరాస కీల‌కం కాబోతుంద‌నే న‌మ్మ‌కం ఆయ‌న‌కి బ‌లంగా ఉంది. ఒక‌వేళ ఆ పరిస్థితే వ‌స్తే… అక్క‌డ ఎవ‌రు ఫోక‌స్ అవ్వాలి..? కేసీఆర్‌.. లేదా ఆయ‌న కుటుంబ స‌భ్యులు మాత్రమే క‌దా!

ఇంకా చెప్పాలంటే… సీఎం కుమార్తె క‌విత‌కు ఈసారి కేంద్ర‌మంత్రి ప‌ద‌వి గ్యారంటీ అనే న‌మ్మ‌కంతో ఉన్నారు. ఈ ల‌క్ష్యం ప్ర‌కారం చూసుకుంటే… పొంగులేటి, జితేంద‌ర్ లాంటి సీనియ‌ర్లు ఆమెకి పోటీ అయ్యే అవ‌కాశం ఉంటుంది. వీరు కూడా ఎంపీలు అయితే… ఢిల్లీలో క‌విత కంటే వీరే ప్రాధాన్య‌త ఉంటుంది. ఆ స్థాయి వాయిస్ కూడా వీళ్ల‌కి ఉంది. పైగా, ఢిల్లీలో ఇత‌ర పార్టీల‌తో లాబీయింగ్ చేయ‌గ‌లిగే స‌మ‌ర్థ‌తా ఈ నాయ‌కుల‌కు ఉంది. సో… ఇలాంటి వారంద‌రినీ ఇప్పుడే క‌ట్ చేస్తే, ఎన్నిక‌ల త‌రువాత కేంద్రం నుంచి తాను ఆశిస్తున్న ప్ర‌యోజ‌నాలు ద‌క్కించుకునేందుకు పోటీ ప‌డేవారు ఉండ‌న‌ట్టే! లోక్ స‌భ ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌పెట్ట‌డం వెన‌క కేసీఆర్ వ్యూహం ఇదే అయి ఉంటుంద‌నే విశ్లేష‌ణ‌లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close