తెలంగాణలో ఆంధ్రుల పై దాడులు: దాడులు అంటే భౌతిక దాడులు మాత్రమేనా?

తెలంగాణలో ఆంధ్రులపై దాడులు జరుగుతున్నాయని నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. వై ఎస్ ఆర్ సి పి.. కేసీఆర్ కి గులాం అవ్వడాన్ని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ భీమవరం సభలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అనంతరం కేటీఆర్ స్పందిస్తూ తెలంగాణలో 29 రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఇక్కడ ఎటువంటి గొడవలు లేవని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో నిజం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

దాడులు అంటే భౌతికమైన దాడులు మాత్రమే కాదని, తమ పార్టీకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్న వారిని బెదిరించడం, వారి ఆస్తులను లిటిగేషన్ లోకి నెట్టడం, ఇవి కూడా దాడుల లాంటివేనని వారంటున్నారు. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో టీవీ9 ఛానల్ లో వచ్చే ఒక కామెడీ ప్రోగ్రాం లో తెలంగాణ ఎమ్మెల్యేలని కించపరుస్తూ టీవీ9, ఆంధ్రజ్యోతి ఛానల్ లో కథనాలు వచ్చాయి. అప్పుడు ఆ చానళ్లను చట్టపరంగా ఎదుర్కోవడంతో పాటు, కేబుల్ టీవీ ఆపరేటర్ చేసే ఎమ్మెస్వో లకి చెప్పి ఆ 2 చానళ్లను కొన్ని నెలలపాటు తెలంగాణలో ప్రసారం కాకుండా చేసిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ దీని గురించి పార్లమెంటులో మాట్లాడినప్పటికీ, చట్టానికి వెలుపల శిక్షించే ఈ బహిష్కరణ కార్యక్రమాన్ని కేసీఆర్ నిలిపి వేయలేదు.

ఇక జనసేనలో చేరుతున్న నాయకులకు టీఆర్ఎస్ తరఫునుంచి బెదిరింపులు వస్తున్నట్టు సోషల్ మీడియాలో రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీలో చేరిన నాయకులను ఆఖరి నిమిషంలో పార్టీ నుంచి రాజీనామా చేయమని, పోటీ నుంచి తప్పుకోవాలని టీఆర్ఎస్ బెదిరిస్తున్నట్లుగా రూమర్లు వినిపిస్తున్నాయి. హైదరాబాదులో కాలేజీలు ఉన్న విష్ణు రాజు నరసాపురం ఎంపీ గా జనసేన తరపున పోటీ చేయించాలనుకుంటే ఆయన పోటీ చేయడం లేదని ప్రకటించాడు. అలాగే విశాఖపట్నం ఎంపీగా టికెట్టు ఖరారైన గేదెల శీను రాత్రికి రాత్రే వైఎస్ఆర్ సీపీ లో చేరిపోయాడు. ఈయనకు హైదరాబాదులో 1000 కోట్ల విలువ చేసే సెజ్ గత ఏడాది కేటాయించబడిన సంగతి తెలిసిందే. హైదరాబాదులో ఏదో రకంగా వ్యాపార బంధాలు ఉన్న నాయకులకు టీఆర్ఎస్ వైపు నుండి ఒత్తిడులు ఉన్న మాట వాస్తవం అని రాజకీయ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి.

భిన్న వర్గాల గళాలు బలంగా వినిపించినప్పుడు ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుంది. హైదరాబాదులో 29 రాష్ట్రాల ప్రజలు ఆనందంగా నివసిస్తున్నారు అని చెబుతున్న కేటీఆర్ , తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి వ్యతిరేకం గా ఎక్కడా ఒక్క వాయిస్ కూడా వినిపించకుండా పోవడానికి కారణం ఏమిటో కూడా చెప్పాలి. సినీ పరిశ్రమ నుండి కానీ, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళ నుండి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక్క వ్యతిరేక వ్యాఖ్య కూడా రాకపోవడానికి కారణం, వ్యాఖ్యలు చేసిన మరుక్షణం వారి మీద జరిగే దాడులే. ఇవి భౌతిక దాడులు కాకపోవచ్చు. కానీ అవతలి వాళ్లను మన దారిలోకి లొంగదీసుకునే ప్రతి ప్రయత్నం కూడా దాడి లాగానే చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఆంధ్రుల పై దాడులు అన్న అంశాన్ని తెరమీదకు తీసుకు వచ్చినట్లుగా అర్థమవుతుంది. ఇప్పుడు కేటీఆర్ కూడా తాము ఎప్పుడు భౌతిక దాడులు చేయలేదని స్పందించాడు కాబట్టి, దాడులు అంటే భౌతిక దాడులు మాత్రమే కాదని ఆంధ్రులను బెదిరించే, లొంగదీసుకోవడానికి ప్రయత్నించే పనులను కూడా దాడులు గానే పరిగణించాల్సి ఉంటుందని పవన్ వ్యాఖ్యానించే అవకాశం ఉంది.

మరి కేసీఆర్ కి ఎదురొడ్డి నిలవడం జనసేనకు ఏ మేరకు సహాయపడుతుంది, అన్ని రకాలుగా కేసీఆర్ చేస్తున్న సహాయం జగన్ కు ఏ మేరకు లాభిస్తుంది అన్నది తెలియాలంటే నెలరోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close