ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా…మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ అభ్యర్థి మృతితో పోలింగ్ ను ఎన్నికల అధికారులు వాయిదా వేశారు.

రెండో విడతలో 15.88 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 1.67 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 16 లక్షలకు పైగా పోలింగ్‌ సిబ్బంది నియమించారు.వివిధ పార్టీల నుంచి 1,202 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలతో పాటు రాజస్థాన్‌లో మిగిలి ఉన్న 13 సీట్లకు నేడు పోలింగ్ జరుగుతోంది. యూపీలో 8, మధ్యప్రదేశ్‌లో 6, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 8,బిహార్‌లో 5, అసోంలో 5, పశ్చిమ బెంగాల్‌‌లో మరియు ఛత్తీస్‌గఢ్‌లో 3, మణిపుర్‌, త్రిపుర, జమ్మూ కశ్మీర్ లో ఒక్కో స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది.

రెండో దఫా ఎన్నికలతో పలువురు రాజకీయ ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొబోతున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వయనాడ్ నుంచి, అలప్పుళ నుంచి కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ , యూపీలోని మథుర బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని, రాజస్థాన్‌లోని కోటా నుంచి ఓం బిర్లా, తిరువనంతపురం నుంచి కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌‌, బెంగళూరు దక్షిణం నుంచి తేజస్వీ సూర్యల భవితవ్యాన్ని ఓటర్లు నిక్షిప్తం చేయనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close