కేసీఆర్‌తో స్నేహం ఉండాల్సిందేనంటున్న రఘురామకృష్ణంరాజు..!

కేసీఆర్‌తో స్నేహం చాలా అవసరం అంటున్నారు నర్సాపురం నుంచి వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణంరాజు. పొరుగు రాష్ట్రంలో స్నేహ సంబంధాలు చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. అప్పుడేదో.. ఆంధ్రప్రదేశ్‌ .. తెలంగాణతో గొడవ పడుతున్నట్లుగా… రఘురామకృష్ణంరాజు చెప్పుకొస్తున్నారు. ఏపీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశాన్ని ప్రతిపక్ష వైసీపీ ఇచ్చి.. వారి పోలీసులతో.. ఏపీపై దండయాత్ర చేసే చాన్సిచ్చిన వైసీపీ నేతలు.. ఇప్పుడు… ఆ కోణంలోనే.. టీఆర్ఎస్‌తో సన్నిహిత సంబంధాలు చాలా ముఖ్యమని.. అంటున్నట్లుగా అనిపిస్తోంది. ఓ వైపు టీఆర్ఎస్‌ను.. ఏపీకి తీసుకొచ్చి.. ఏపీ ఆత్మగౌరవాన్ని ఆయన కాళ్ల దగ్గర పెడుతున్నారన్న విమర్శలు చాలా కాలంగా వస్తున్నాయి. వాటి గురించి ఏ మాత్రం మాట్లాడని… రఘురామకృష్ణంరాజు.. టీఆర్ఎస్ సపోర్ట్.. కేసీఆర్ స్నేహం కావాల్సిందేనన్నట్లుగా చెప్పుకొస్తున్నారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భావోద్వేగ పూరిత వాతావరణంలో నడుస్తున్నాయి. తెలంగాణలో ఆంధ్రులెందుకని.. వారి పెత్తనం మనకెందుకని ప్రశ్నించిన… కేసీఆర్.. ఇప్పుడు.. ఏపీపై పెత్తనానికి ప్రయత్నిస్తూండటం.. తమ రాష్ట్రానికి లేని పోర్టుని జగన్మోహన్ రెడ్డి అండతో… చేజిక్కించుకోవడం కోసం.. ఆ పార్టీకి ఫండింగ్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు ఆంధ్రుల్ని తిట్టిన కేసీఆర్‌కు ఇప్పుడు ఏపీ భూభాగంలో చోటివ్వడానికి జరుగుతున్న ప్రయత్నాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినా సరే కేసీఆర్‌తో తమకేమీ సంబంధాలు లేవని చెప్పుకోవడనికి వైసీపీ నేతలు ఏ మాత్రం వెనుకాడటం లేదు.

కేసీఆర్ ముఖ్య లక్ష్యం… వైసీపీ తరపున గెలిచిన ఎంపీలను తన ఖాతాలో వేసుకుని.. ఢిల్లీలో చక్రం తిప్పడం ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు… కేసీఆర్ నేరుగా ప్రకటించారు. జగన్ కూడా దానికి అంగీకరించారు కూడా. ఎన్నికల ప్రచారసభల్లో.. కేసీఆర్ తాను.. 120 మంది ఎంపీలను పోగేశానని చెబుతున్నారు. అయితే.. అవి గెలిచినవి కాదు.. ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లు. డీఎంకే, టీఎంసీ, జేడీఎస్ లాంటి కాంగ్రెస్ మిత్రపక్షాలతో పాటు.. వైసీపీ పోటీ చేస్తున్న ఏపీలో ఉన్న ఇరవై ఐదు స్థానాలను కలిపి ఆ 120 చెబుతున్నారు. అందులోనే అసలు విషయం దాగి ఉంది. అయితే ఎన్ని స్థానాల్లో గెలుస్తారన్నది తర్వాత విషయం.. అయితే ఎన్నికలకు ముందే వైసీపీ ఎంపీ అభ్యర్థులు.. కేసీఆర్‌కు మద్దతు ప్రకటించేస్తున్నారు. ఆయన స్నేహం కావాలంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close