అయిదుగురు హీరోలు రిజ‌క్ట్ చేసిన క‌థ అది!

హోళీ రోజున నితిన్ – చంద్ర శేఖ‌ర్ ఏలేటి కాంబినేష‌న్ గురించిన వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ కాంబో నిజంగానే అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఎందుకంటే.. యేడాదిగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి మైత్రీ మూవీస్ లోనే ఉన్నాడు. ఓ క‌థ త‌యారు చేసుకుని… అందుకు త‌గిన హీరో కోసం అన్వేషిస్తున్నాడు. ఎన్టీఆర్ మొద‌లుకుని నాని వ‌ర‌కూ… దాదాపు అయిదుగురు హీరోల‌కు ఈ క‌థ చెప్పాడు. క‌థ విన్న‌ వారిలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్‌తేజ్‌, గోపీచంద్‌లు కూడా ఉన్నారు. వాళ్లంతా ఈ క‌థ‌ని తిప్పికొడితే అది నితిన్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆగింది. పైగా ఈ సినిమా కోసం మైత్రీ మూవీస్ ద‌గ్గ‌ర అడ్వాన్సు తీసుకున్న చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి, ఆ అడ్వాన్సు సైతం వెన‌క్కి ఇచ్చేసి భ‌వ్య ఆర్ట్స్ తో చేతులు క‌లిపారు. ఏప్రిల్ నుంచి ఈ సినిమా మొద‌లెడ‌తార‌ని చిత్ర‌బృందం తెలిపినా…. అది అంత ఈజీ వ్య‌వ‌హారం కాద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి సెకండాఫ్ ఇంకా పూర్తి స్థాయిలో రెడీ కాలేద‌ట‌. నిజానికి సెకండాఫ్, క్లైమాక్స్‌లు న‌చ్చ‌కే… ఆ అయిదుగురు హీరోలూ ఈ క‌థ‌ని తిప్పి పంపించార‌ని తెలుస్తోంది. నితిన్ ద‌గ్గ‌ర‌కు వెళ్లినా… ఆ స‌మ‌స్య తీర‌లేదు. అయినా స‌రే – నితిన్ అధికారికంగా ఈ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు. చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి చెప్పిన సెకండాఫ్ న‌చ్చేసిందా? లేదంటే.. ఈలోగా మార్పులు చేర్పుల‌తో మెప్పిస్తాడ‌న్న ధీమానా?? ఈ సంగ‌తి నితిన్‌కే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close