బుర్రా సాయిమాధ‌వ్ కోసం కొత్త పోస్టు… ర‌చ‌నా ప‌ర్య‌వేక్ష‌ణ

రాఘ‌వేంద్ర‌రావు ద‌య వ‌ల్ల ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ అనే కొత్త పోస్టు ఒక‌టి వ‌చ్చింది. నిర్మాణ ప‌ర్య‌వేకణ (ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూస‌ర్‌) అనేది ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఇప్పుడు కొత్త‌గా ర‌చ‌నా ప‌ర్య‌వేక్ష‌ణ అనే ప‌దం క‌నిపెట్టారు. బుర్రా సాయిమాధ‌వ్ కోసం. భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ‘కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి’ అనే ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం బుర్రా సాయిమాధ‌వ్ ర‌చ‌నా ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నారు. నిజానికి ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు పూర్త‌యిన త‌ర‌వాత‌… బౌండెడ్ స్క్రిప్టు బుర్రా చేతికి వెళ్లింది. అందులో కొన్ని కీల‌క‌మైన‌ సీన్లు బుర్రా మ‌ళ్లీ కొత్త‌గా రాశారట‌. అందుకే ర‌చ‌నా ప‌ర్య‌వేక్ష‌కుడిగా త‌న పేరు వేసుకుంటున్నారు. ఆయ‌న రాసింది కేవ‌లం కొన్ని స‌న్నివేశాలే అయినా… భారీ మొత్తంలో పారితోషికం కూడా అందుకున్నారట‌. కె.ఎస్‌.రామారావు గ‌తంలో తీసిన ‘మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానీరోజు’ చిత్రానికి సంభాష‌ణ‌లు అందించారు బుర్రా. ఆ సినిమా బుర్రాకి మంచి పేరు తీసుకొచ్చింది. అందుకే తాను సైరా, ఆర్‌.ఆర్‌.ఆర్ సినిమాల‌తో బిజీగా ఉన్నా స‌రే… ‘కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి’కి ప‌నిచేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వంద కోట్ల వెబ్ సిరీస్ ఏమైంది రాజ‌మౌళీ?!

బాహుబ‌లి ఇప్పుడు యానిమేష‌న్ రూపంలో వ‌చ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే 'బాహుబ‌లి' సినిమాకీ ఈ క‌థ‌కూ ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఆ పాత్ర‌ల‌తో,...

గుంటూరు లోక్‌సభ రివ్యూ : వన్ అండ్ ఓన్లీ పెమ్మసాని !

గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి ఓ అభిప్రాయం బలంగా ఉంది. దీనికి కారణం వైసీపీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి వెనకడుగు వేయడం....

కాళ్లు పట్టేసుకుంటున్న వైసీపీ నేతలు -ఎంత ఖర్మ !

కుప్పంలో ఓటేయడానికి వెళ్తున్న ఉద్యోగుల కాళ్లు పట్టేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వారి తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుప్పంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓట్లు వేసేందుకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు...

‘పూరీ’ తమ్ముడికి ఓటమి భయం?

విశాఖపట్నం జిల్లాలో ఉన్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి నర్సీపట్నం 'హార్ట్' లాంటిది, ఇక్కడ రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close