వైకాపా అభ్య‌ర్థి గెలిస్తే కేసీఆర్ గెలిచిన‌ట్టేన‌న్న ప‌వ‌న్‌!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీలోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని ఆప‌రేట్ చేస్తున్నార‌న్న చ‌ర్చను రాజ‌కీయ పార్టీలు ప్ర‌ముఖం చేస్తున్నాయి. ఇదే అంశంపై ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌తీ స‌భ‌లో చెబుతున్నారు. ఏపీలో ఫ్యాన్ తిర‌గాలంటే, హైద‌రాబాద్ లో కేసీఆర్ స్విచ్ ఆన్ చెయ్యాలి, ఢిల్లీ నుంచి న‌రేంద్ర మోడీ క‌రెంట్ ఇవ్వాలంటూ ప్ర‌తీ స‌భ‌లోనూ ప్ర‌ముఖంగా ప్ర‌స్థావిస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఈ చ‌ర్చ‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా మాట్లాడారు. కేసీఆర్ అనుమ‌తి ఇస్తే త‌ప్ప వైకాపా నాయ‌కుల్ని నిల‌బెట్టుకునే ప‌రిస్థితి లేద‌ని ప‌వ‌న్ నూజివీడులో విమర్శించారు.

వైకాపా ఎమ్మెల్యే గెలిస్తే ప‌రిశ్ర‌మ‌లు వ‌చ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌న్నారు. ఎందుకంటే, ఆంధ్రాకి వ‌చ్చే ప‌రిశ్ర‌మ‌ల్లో త‌మ‌కు వాటా కావాలంటూ జ‌గ‌న్‌, విజ‌య‌సాయి రెడ్డిలు లంచాలు అడుగుతార‌న్నారు. అందుకే, వైకాపా గెలిస్తే ప‌రిశ్ర‌మ‌లు రావ‌న్నారు. కాబ‌ట్టి, ప‌ని చెయ్య‌నివారిని ఎందుకు గెలిపించ‌డ‌మ‌న్నారు. అందుకే, వైకాపాని ప‌క్క‌న‌పెట్టెయ్యాల‌నీ, ఎందుకంటే వారు పులివెందుల నుంచి ఆప‌రేట్ చేస్తార‌న్నారు. జ‌గ‌న్ కి ఆంధ్రా అంటే నిజంగా ప్రేమ ఉంటే… అమ‌రావ‌తి వ‌చ్చి టిక్కెట్లు ప్ర‌క‌టించాలి క‌దా, కానీ ఆయ‌న హైద‌రాబాద్ లో కూర్చుని పంచుతారేంట‌ని ప్ర‌శ్నించారు? తాను అంద‌రికీ అందుబాటులో ఉంటాన‌నీ… కేసీఆర్ క‌నుస‌న్న‌ల‌లో న‌డిచే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని కాద‌న్నారు.

చంద్ర‌బాబు నాయుడు మీద కోపంతో గిఫ్ట్ ఇవ్వాల‌నుకుంటే, వ‌చ్చి నేరుగా పోటీ చేయాల‌ని తెలంగాణ అధికార పార్టీ నాయ‌కుల‌ను ఉద్దేశించి ప‌వ‌న్ అన్నారు. వైకాపా అభ్య‌ర్థి గెలిస్తే… అక్క‌డ తెరాస అభ్య‌ర్థి గెలిచిన‌ట్టేన‌ని ప‌వ‌న్ చెప్పారు. వైకాపా అభ్య‌ర్థులు గెలిస్తే… ఆంధ్రులు ద్రోహులు అని తిట్టిన కేసీఆర్ గెలిచిన‌ట్టే అన్నారు. వైకాపా అభ్య‌ర్థి గెలిస్తే… ఆంధ్రుల ఆత్మగౌర‌వం పోయిన‌ట్టేన‌ని గుర్తుపెట్టుకోవాల‌న్నారు. ఆంధ్రా నాయ‌కులు తెలంగాణ రాకూడ‌ద‌టా, కానీ తెలంగాణ నాయ‌కులు వైకాపా ద్వారా ఆంధ్రాలోకి రావొచ్చా అని ప్ర‌శ్నించారు. 2014 ఎన్నిక‌ల్లో టి.ఆర్‌.ఎస్‌. విద్యార్థి విభాగం తెలంగాణ నుంచి జ‌గ‌న్ ను త‌రిమేశార‌నీ, అలాంటి తెరాస నాయ‌కులు ఇప్పుడు జ‌గ‌న్ కి మ‌ద్ద‌తు ప‌లుకుతానంటే ఎలా అని ప్రశ్నించారు. ఐదేళ్లు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఏమీ చెయ్య‌లేని జ‌గ‌న్‌, ముఖ్య‌మంత్రి అయితే ఏం చేస్తారంటూ ప‌వ‌న్ విమ‌ర్శించారు. ఆంధ్రాలో కేసీఆర్ నీడ‌లోనే వైకాపా ప‌నిచేస్తోంద‌నే అభిప్రాయాన్ని ప‌వ‌న్ మ‌రింత బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చేశారు. మ‌రి, ఈ విమ‌ర్శ‌ల‌కు వైకాపా నుంచి వ‌చ్చే స‌మాధానం ఏముంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close