యూపీ కాంగ్రెస్ , బీజేపీ మధ్యలో సప్నా చౌదరీ..! కథ చాలా పెద్దదే..!

సప్నా చౌదరి అనే భోజ్ పురి నటి వ్యవహారం… కాంగ్రెస్, బీజేపీ మధ్య మంటలు రాజేస్తోంది. సప్నా చౌదరీని కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో పాటు వారణాసిలో పోటీ చేయించాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు ఒక ప్రచారం జరిగింది. స్టేజ్ డ్యాన్సులకు పేరు పొందిన భోజ్ పురి నటి సప్న.. వారణాసిలో ప్రచారానికి వస్తే జనం తెగబడతారని బీజేపీ అనుమానిస్తోంది.దానితో ప్రచార శైలి మారిపోయే ప్రమాదం ఉందని భయపడుతోంది. అందుకే సప్న పేరు చెప్పగానే బీజేపీ అంతెత్తున ఎగిరిపడుతోంది. మరో పక్క యూపీలో ఇప్పుడు టఫ్ ఫైట్ ఖాయమని తాజా సర్వేలు చెబుతున్నాయి.అక్కడ 80 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 71 చోట్ల గెలిచింది. ఇప్పుడా పరిస్థితి లేదని తేల్చేశారు. ఎస్పీ – బీఎస్పీ కలిసి పోటీ చేస్తున్న తరుణంలో బీజేపీకి గడ్డు కాలం ఖాయమని గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి తెలుస్తోంది. ఎన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

పార్టీని గెలిపించి తీరుతామన్న బాధ్యతను నెత్తికెత్తుకున్న యూపీ బీజేపీ నేతలకు ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి బీజేపీ నేతలు సప్నా చౌదరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సురేంద్ర సింగ్ అనే బీజేపీ నేత సోనియాగాంధీలాగే ఆమె డాన్సర్ అని పోల్చితే… యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ మరో అడుగు ముందుకేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కొజ్జా అంటూ సంబోధించారు. కాంగ్రెస్ పెద్దగా స్పందించకపోయినా.. కాంగ్రెస్ మిత్రపక్షం ఆర్జేడీ మాత్రం అంతే తీవ్రంగా స్పందించింది. రాహుల్‌ కొజ్జా అయితే మోదీ ఏంటంటూ ట్విటర్‌లో ప్రశ్నించింది. మరో వైపు..ఈ గొడవల కారణంగా కాంగ్రెస్లో చేరినట్లు ప్రచారం జరిగిన సప్నా చౌదరీ యూటర్న్‌ తీసుకున్నారు. తాను కాంగ్రెస్‌లో చేరలేదనీ, అసలు ఏ పార్టీ తరఫునా పోటీ కూడా చేయట్లేదని, ప్రియాంక గాంధీతో ఉన్న ఫోటో కూడా పాతదని ఆమె ట్విటర్‌ వేదికగా వివరణ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో గందరగోళం నెలకొంది.

దీంతో కాంగ్రెస్‌ ఆమె పార్టీలో చేరేందుకు ఫారం నింపుతున్న ఓ వీడియోను బయటపెట్టడంతో అది వైరల్‌ అయ్యింది. ‘ఆమె స్వయంగా శనివారం నాడు పార్టీ ఆఫీసుకొచ్చి ఫారం నింపి వెళ్లారు. ఆమె సోదరి కూడా కాంగ్రెస్‌లో చేరారు’ అని యూపీసీసీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర రథి ప్రకటించారు. ఈ గొడవ జరుగూతండగానే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీతో సప్న భేటీ అయ్యారనే ఫోటోలు బయటకు వచ్చాయి. ఇప్పుడీ సప్నా చౌదరీ ఏ పార్టీలో ఉన్నారన్నది హాట్ టాపిక్ అయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close