రాజకీయం కోసం కుటుంబంలో చిచ్చు పెట్టకండి..! వైసీపీకి నారా రోహిత్ వార్నింగ్..!

ప్రతి ఎన్నికల సమయలో.. వైఎస్ జగన్ కు చెందిన సాక్షి మీడియా… నారా, నందమూరి కుటుంబాల్లో విబేదాలంటూ.. కధలు రాయడమే కాదు. విడిగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంలోనూ.. వివాదాలున్నాయని ప్రత్యేకంగా కథనాలు రాస్తూ ఉంటారు. దాని కోసం.. ఓ చోటా వైసీపీ నేతతో.. ప్రకటన చేయిస్తారు. ఆ తర్వాత తమ పని తాము చేసుకుంటారు. ఇలానే… చంద్రబాబు.. తన సోదరుడు అయిన రామ్మూర్తినాయుడికి విబేధాలున్నాయంటూ.. సాక్షి మీడియా ప్రచారం ప్రారంభించింది. దీనిపై .. రామ్మూర్తి నాయుడు కుమారుడు… సినీ హీరో నారా రోహిత్ … ఘాటుగా స్పందించారు. జకీయ ప్రయోజనాల కోసం మా కుటుంబంపై, మా మధ్య ఉన్న బంధంపై బురద చల్లవద్దని హెచ్చరించారు.

నారా అనే పేరును రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్‌ గా మార్చడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి అభినందనీయమని.. రామలక్ష్మణుల్లా కలిసి ఉండే పెదనాన్న, నాన్న రామ్మూర్తి నాయుడు మధ్య విభేదాలున్నాయంటూ కొందరు వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించొద్దని హెచ్చరించారు. నారా పేరును నిలబెట్టడానికి మా కుటుంబం నుంచి ఒక్కరు చాలు… కనుకనే తామంతా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడుస్తారని గుర్తు చేశారు.

నాలుగు దశాబ్దాల క్రితమే సమాజ అభివృద్ధి కోసం తమ ఆస్తులను పాఠశాలలకు, పంచాయతీ భవనాలకు ఇచ్చామనే విషయాన్ని మరిచిపోకండి… మాకు రాష్ట్ర అభివృద్దే ముఖ్యం. మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారన్న వాదన నూటికి నూరుపాళ్లు అవాస్తవం, అసత్యమని ఖండించారు.

రాత్రింబవళ్లు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఏవిధంగా చూసుకుంటున్నారో.. మమ్మల్ని అదేవిధంగా చూసుకుంటున్నారుని రోహిత్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ పదవి కోసం సొంత బాబాయి మీదనే చేయి చేసుకున్న చరిత్ర వైఎస్‌ కుటుంబానిదని.. అటువంటి నీచ చరిత్ర తమకు అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. కోర్టులు, జైళ్లు చుట్టూ తిరిగే మీకేం తెలుసు కుటుంబ బాంధవ్యాల విలువ? అని ప్రశ్నించారు. నాన్న ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కనుకనే ఆయన ఇంటికే పరిమితమయ్యారని…రాజకీయంగా చంద్రబాబు నాయుడును ఎదుర్కోలేకనే.. కుటుంబ సభ్యులపై, వారి వ్యక్తిగత షయాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. గతంలో రామ్మూర్తి నాయుడు.. చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రొత్సాహంతోనే.. నారా రోహిత్ హీరోగా మారారు. అయితే ప్రతీ ఎన్నిక సందర్భంలోనూ.. నారా బ్రదర్స్ మధ్య విబేధాలంటూ సాక్షి మీడియా రాసుకొస్తూనే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close